Tuesday, October 19, 2021
spot_img

వృద్ధాప్యంలో ఎడబాటు బాధాకరం

ప్రశ్న:-”మాది చిన్న రైతు కుటుంబం. ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. మాకు ఉన్న కొద్దిపాటి ఆస్థి పిల్లలకి ఇవ్వడంతో సరిపోయింది. ఇప్పుడు మేమిద్దరం వృద్ధాప్యంలో ఉన్నాం. మా ఆలనాపాలనా మా పిల్లలే చూస్తున్నారు. అబ్బాయి దగ్గర కొంతకాలం నన్ను ఉంచుకుంటే అమ్మాయి దగ్గర మా ఆవిడ కొంతకాలం ఉంటుంది. మళ్ళీ కొంతకాలానికి మా ఇద్దరిని వాళ్ళు మార్చుకుంటారు. ఇలా మార్చుకుంటూ చెరొకరి దగ్గర ఉంటూ వస్తున్నాం. కాని ఇద్దరం కలిసి ఉండే పరిస్థితి లేదు. పిల్లలు ఇంత ముద్ద పడేస్తున్నా ఏదో వెలితి, బాధ, ఎడబాటు. ఇద్దరం బ్రతికే ఉన్నప్పటికీ దూరం దూరంగా ఉండవలసి వస్తోంది. నాకు అప్పుడప్పుడూ సెక్స్‌ కావాలని ఉంటుంది. కాని భార్య నా దగ్గర ఉండదు కదా. ఒకవేళ చుట్టపు చూపుగా భార్య ఉన్న చోటికి వెళ్ళినా వరండాలోనే తనతోపాటు ఉండాలి. వృద్ధాప్యంలో ఈ ఎడబాటు చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి ఎడబాటు నాకే కాదు ఇంకెందరికో ఉండటం నేను గమనించాను. ఆస్తులని పంచుకున్నట్లు తల్లిదండ్రులని పంచుకోవడం చాలా బాధాకరమైన విషయం. అయినా వృద్ధాప్యంలో పిల్లల మీద ఆధారపడవలసి వచ్చినప్పుడు కదా. ఈ వయస్సులో అప్పుడప్పుడూ కలిగే తీవ్రమైన సెక్సు కోరికను ఎలా అణచుకోవాలో తెలియజెయ్యండి.” 

జవాబు:- ఈనాటి కుటుంబ వ్యవస్థలో, ఆర్థిక పరిస్థితుల్లో వృద్ధాప్యం వచ్చిన కొందరి తల్లిదండ్రుల పరిస్థితి మీలాగే దయనీయంగా ఉంది. పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకి సంపాదించినదంతా పెట్టేసి చివరికి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సి వస్తోంది. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులని పిల్లలు పంచుకుని చెరొకరి దగ్గర ఉంచుకుంటారు తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్‌ ఎటాచ్‌మెంట్‌ ఒకటి ఉంటుందని తెలుసుకోరు. వృద్ధాప్యంలో ఎమోషనల్‌ ఎటాచ్‌మెంట్‌ మరింత అవసరం. పిల్లలతో కలిసి ఉండటం ఎంత అవసరమో వృద్ధ దంపతులిద్దరూ ఒకేచోట ఉండడం కూడా అంతగానే అవసరం. అప్పుడే వాళ్ళ మనస్సులో తృప్తి, ఆనందం ఉంటాయి. అందుకని వృద్ధాప్యంలో భార్యాభర్తలిద్దరూ ఒకేచోట ఉండే విధంగా ముందు నుంచే ప్లాన్‌ చేసుకోవాలి. ఆస్తుల్ని పంచేసినా తమ ఇద్దరినీ ఒకచోట ఉంచి చూసుకునేలా పిల్లల మనస్సుని ముందుగానే ప్రిపేర్‌ చేయాలి. అలా చేసుకున్నప్పుడే వృద్ధాప్యంలో కలిగే సెక్సు కోరికలకి పరిష్కారం కుదురుతుంది. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!