ప్రశ్న:-”నా వయస్సు 22 సంవత్సరాలు. సెక్స్ నాలెడ్జ్ లేనేలేదు. ఇంట్లో వాళ్ళు అటువంటి పుస్తకాలని, పేపర్లని చదవనివ్వరు. అసలు సెక్స్ విషయాలనే మాట్లాడనివ్వరు. సరదాకి కూడా వాటి ప్రస్తావన ఎత్తకూడదు. ఇప్పుడు నాకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. మొన్న నా స్నేహితుడు జోకుగా అన్నాడో, నిజంగా అన్నాడో తెలియదుగానీ ”ఒరే రెండు బెజ్జాలుంటాయి. ఒకదానికి బదులు మరొక దానిలో చేశావో నీ పని అవుట్. ఇక జన్మలో అమ్మాయి నిన్ను దగ్గరికి రానివ్వదు” అన్నాడు. అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. పెళ్ళయ్యాక కూడా మా వాళ్ళు ఏమీ చెప్పకుండా గదిలోకి పంపుతారని ఖాయంగా చెప్పగలను. అమ్మాయికి కూడా అనుభవం ఉండదు కదా. అనుకోని పొరపాటు జరిగితే ఇక నా గతి ఏం కాను?”
జవాబు:- సెక్స్ విజ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం. సెక్స్ విజ్ఞానం లేనందువల్లే రకరకాల భయాలు, అనుమానాలు పీడిస్తాయి. దానివల్లే సెక్స్‌లో వైఫల్యాలు కలుగుతాయి. మీ స్నేహితుడు అన్నట్టు స్త్రీ యోనిలో రెండు రంధ్రాలు ఉండటం నిజమేగాని, రెండవ రంధ్రం అది చిన్నది. అది మూత్రం వచ్చే రంధ్రం. ఆ రంధ్రంలోకి పొరపాటుగా కూడా అంగప్రవేశం జరగదు. అందుకని జరగరానిదేదో జరిగిపోతుందనే భయం వదలండి. పెద్దలు ఏదో అంటారని విషయాలు తెలుసుకోకుండా ఉంటే ఎదురయ్యేవి ఇబ్బందులే. సుఖమయ సంసార జీవితానికి సెక్స్ విజ్ఞానం అత్యంత అవసరం. మీకు కావలసిన విషయాలని నిర్భయంగా తెలుసుకోండి. జంకు అనవసరం.