ప్రశ్న:- ”నాకు తరచూ పొత్తి కడుపు బిగదీస్తుంది. దాంపత్యంలో పాల్గొన్నప్పుడు సుఖం కంటే బాధే ఎక్కువ. మా వారికి రోజూ సెక్స్ కావాలి. నాకు మాత్రం ఆయన దగ్గరికి వస్తుంటేనే వణుకు మొదలవుతుంది. దానికి కారణం సెక్స్‌లో నొప్పి అనిపించడమే. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత మూత్రం కూడా మంట అనిపిస్తుంది. సెక్స్ అయిపోయిన తరువాత మా వారు చక్కగా నిద్రపోతారు గాని, నేను మాత్రం నాలుగు గంటలు చాలా బాధపడతాను. మా వారు చాలా బలంగా ఉంటారు, వారి పురుషాంగం కూడా పెద్దదిగా అనిపిస్తుంది. సెక్స్‌లో నా బాధ అంతటికీ ఆయన పురుషాంగం పెద్దదిగా ఉండటం కారణమా? ఆయన ఇచ్చే స్ట్రోక్స్కి యోని లోపల నలిగిపోతోందా? ఏదైతేనేమి నాకు సెక్స్ సుఖం వద్దనిపిస్తోంది. మా వారిని అందుకు ఒప్పించడం ఎలా?”
జవాబు:- కొందరు స్త్రీలకు గర్భాశయం పేగులు ఇన్ఫెక్షన్కి గురై వాస్తాయి. పుండుగా మారతాయి. దానివల్ల మామూలుగానే పొత్తికడుపు కాస్త బిగదీసినట్టుగా ఉంటుంది. సెక్స్‌లో పాల్గొంటే స్ట్రోక్స్కి మరింత బాధ అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితినే పి.ఐ.డి. లేదా పెల్విక్ ఇన్ప్లమేటరీ డిసీజ్ అంటారు. డాక్టరు చేత పరీక్ష చేయించుకుని సరైన యాంటిబయోటిక్ మందులు వాడితే పెల్విక్ ఇన్ప్లమేటరీ డిసీజ్ తగ్గిపోతుంది. దాంపత్యంలో ఎటువంటి బాధా లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.