ప్రశ్న:- ”నా వయసు 65 సంవత్సరాలు. నేను ఆరోగ్యంగానే ఉంటాను. షుగరు, బి.పి. లేవు. ఎందుకనో ఇటీవల చాలా త్వరగా అలసిపోతున్నాను. శరీరంలో అక్కడక్కడా ఏదో బాధ అనిపిస్తుంది. నుడుం నొప్పి కూడా ఉంటోంది. హుషారు తగ్గిపోయింది. పూర్వకాలం సెక్స్ అంటే ఎంతో ఇంట్రెస్టు ఉండేది. ఇప్పుడు సెక్స్ మీద కూడా ఆసక్తి తగ్గింది. సెక్స్ సామర్థ్యం కూడా తగ్గింది. డల్‌గా మారాను. ఏ జబ్బు లేకుండా నేను ఇలా సంసారం జీవితంలోనూ, సాధారణ ఆరోగ్య విషయంలోనూ డల్‌గా మారడం ఎందుకని? డాక్టరు సలహా మేరకు బి.కాంప్లెక్స్, కాల్షియం బిళ్ళలు చాలా వేసుకున్నాను. ప్రయోజనం ఏమీ కనబడలేదు. నా బ్రతుక్కి మీరే దారి చూపాలి.”
జవాబు:- పురుషుల్లో 55-60 సంవత్సరాలు దాటిన తర్వాత టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువై ‘యాండ్రోపాజ్’ అనే పరిస్థితి డెవలప్ అవుతుంది. దానివల్ల సెక్స్‌లో ఆసక్తి, సామర్థ్యం తగ్గడం, డిప్రెషన్ లక్షణాలు ఏర్పడటం ఉంటాయి. డాక్టరు సలహా మేరకు టెస్టోరిస్టిరోన్‌కి సంబంధించిన మందులు వాడితే మళ్ళీ ఆరోగ్యం మామూలు అవుతుంది. డల్‌నెస్ తొలుగుతుంది. మీ డాక్టరుని యాండ్రోపాజ్ వచ్చిందేమో అడగండి. దానికి తగిన చికిత్స పొందండి. తప్పకుండా బాగుపడతారు.