ప్రశ్న:- ”నా వయస్సు 22 సంవత్సరాలు. ఇంకా పెళ్ళికాలేదు. సెక్స్పరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అందమైన అమ్మాయిలను చూస్తే ఇక వాళ్ళే మనస్సులో మెదులుతూ ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు పురుషాంగానికి చేతితో ప్రేరణ కలిగించుకుని తృప్తి పొందుతాను. ఇలా చేయడం నష్టదాయకం అని విన్నాను. కాని ఈ అలవాటుని మానుకోలేకపోతున్నాను. మనస్సు ఊరుకోదు. నేను వైవాహిక జీవితానికి పనికిరాకుండా అవుతాననే భయం ఉంది. ఈ అలవాటు మానుకునేందుకు మందులు తెలియజేయండి.”
జవాబు:- యుక్త వయస్సు వచ్చిన దగ్గర నుంచి లైంగిక పరమైన ఆలోచనలు మొదలవుతాయి. స్వయంతృప్తి పద్ధతి ద్వారా లైంగిక తృప్తి పొందడం అతి సాధారణమైన విషయం. ఇదేమీ హానికరమైన అలవాటు కాదు. వైవాహిక జీవితానికి పనికి రాకుండా పోరు. ప్రత్యేకంగా మందులు వాడనవసరం లేదు. చదువు మీద మరింత మనస్సు లగ్నం చేయండి. దాంతో మీ చదువుకి ఆటంకం కలుగదు.