Saturday, October 16, 2021
spot_img

ఆమెది హిస్టీరియా

ప్రశ్న:-”మా ఆవిడ ఉన్నట్టుండి పడిపోతుంది. ఒళ్ళంతా బిగుసుకుపోతుంది. అలా పడిపోయిన తర్వాత ఒక్కోసారి పావుగంటకే లేచిపోతే, మరొకసారి రెండు గంటలు దాకా మెలకువ రాదు. డాక్టరుకి చూపిస్తే మూర్ఛవ్యాధి కాదన్నారు. ఏవేవో మందులు ఇచ్చారు కాని స్పృహ తప్పి పడిపోవడం, బిగుసుకు పోవడం తగ్గలేదు. గాలి, దెయ్యం అనుమానంతో మంత్రాలు, తాయెత్తులు కట్టించాను. ఎంతో ఖర్చుచేశాను. అయినా ఫలితం శూన్యం. ఇదేమైనా అంతుపట్టని వ్యాధా? ఏం చేయాలి?” 

జవాబు:- మీ శ్రీమతికి హిస్టీరియా వ్యాధి ఉంది. హిస్టీరియా వ్యాధి మానసిక వ్యాధే. మనస్సులో ఏదైనా బాధ, ఆలోచన ఉన్నట్టయితే అవి విపరీతమై మానసిక ఒత్తిడిని పెంచేస్తాయి. మనస్సు దాన్ని తట్టుకోలేనప్పుడు స్పృహతప్పి పడిపోతారు. ఇటువంటి మానసిక బాధ, ఒత్తిడి చాలా సందర్భాలలో అర్థం లేనివిగా ఉంటాయి. అది భర్త మీద కోపం కావచ్చు. భర్త తనని సరిగ్గా చూడటం లేదని బాధ కావచ్చు. అత్త మీద చిరాకు కావచ్చు. ఏది ఏమైనా వీటిని విజ్ఞతతో సరిదిద్దుకోవచ్చు. కాని విజ్ఞతను కోల్పోయి కోపాన్ని, బాధని మనస్సులోనే దిగమింగుకుని విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనైతే దాన్ని తట్టుకోలేక ఫెయింట్‌ అవడం ఉంటుంది. ప్రతి సమస్యకి మంచి పరిష్కారం ఉంటుంది. విజ్ఞతని ఉపయోగించని వారిలోనే మనస్సు అనవసరంగా ఎక్కువ ఒత్తిడికి లోనవడం, పడిపోవడం ఉంటుంది. హిస్టీరియా ఫిట్స్‌ ఉన్నప్పుడు కౌన్సిలింగ్‌ చేసి ఆమె మనస్సుకి బాధపెట్టే పరిస్థితులని చక్కదిద్దితే, విజ్ఞతతో సమస్యని ఎలా పరిష్కరించుకోవచ్చో సూచిస్తే పడిపోవడం ఉండదు. ఎక్కువగా హిస్టీరియా ఫిట్స్‌ మానసిక పరిణతి లేనివాళ్ళల్లోనూ, నా మాటే నెగ్గాలనే హఠం ఉన్న వాళ్ళల్లోనూ కనబడతాయి. సైకోథెరపీతో ఇటువంటి మానసిక స్థితిని సరిదిద్దవచ్చు. హిస్టీరియా ఫిట్స్‌ని అర్థం చేసుకోకుండా, వాటి లోతుపాతులని పరిశీలించకుండా దెయ్యమో, గాలో అనుకుని యంత్రాలు, తాయెత్తులు కట్టడం వాళ్ళలోని మూఢనమ్మకాలకి పరాకాష్ట, దెయ్యాలు, గాలులు లేనేలేవు. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!