ప్రశ్న:- ”నా వయస్సు 24 సంవత్సరాలు. పెళ్ళై సంవత్సరన్నర అయింది. మాకు రెండు నెలల పాప ఉంది. కాని మా దాంపత్య జీవితం ఒక పెద్ద సమస్యగా అనిపిస్తుంది. ఇంటర్ వరకు చదువుకున్నాను. ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాను. నా భార్య చాలా చురుకుగా ఉండాలని, అందరితో కలుపుకోలుగా మాట్లాడాలని కోరుకుంటాను. కాని నాతోనూ మాట్లాడదు, ఇతరులతోనూ మాట్లాడదు. అందానికి లోటు లేదు. కాని ఏం లాభం? ఆమెకు సెక్స్ పట్ల ధ్యాసే లేదు. అయినా ఒక పాప పుట్టేసింది. ఆమెతో సరదాగా షాపింగ్‌కి, పార్కులకి తిరగాలని ఎంతగానో ఉంటుంది. ఆమెను వెంట తీసుకుని బయటకి వెళితే అందరూ మమ్మల్ని చూసి ముచ్చట పడాలని అనిపిస్తుంది. అయినా షాపింగ్‌లకి, సినిమాలకి రాదు. ఫంక్షన్లకి కూడా రాదు. ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు నా మీద ప్రేమ, అభిమానం కలగాలని ఇంట్లో వంట పనిలో కూడా సహకరిస్తాను. అలా చేస్తుంటే తిడుతుందే తప్ప మెచ్చుకోదు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు రకరకాలుగా ప్రేరేపిస్తాను. ఇలా ఎవరైనా చేస్తారా అని అసహ్యించుకుంటుంది. నేను ఎన్ని తిప్పలు పడుతున్నానో ఎవరికీ అర్థం కాదు. చూసిన వాళ్ళు మాత్రం మమ్మల్ని చిలకా గోరింకలు అనుకుంఠారు. కాని శృంగారం లేని జీవితం శూన్యం అని ఎలా తెలుస్తుంది. నా భార్య తీరు మారేదెలా?”
జవాబు:- కొందరు చిన్నప్పటి నుంచే ఇంట్రోవర్డెడ్గా ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఇతరులతో కలవాలని అనుకోరు. ఇంకొకరితో తమ ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకోరు. ఏదో బతికేస్తూ ఉంటారు. ఎంత చదువుకున్నా, ఎంత హోదా వచ్చినా ఇలా ఉండేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఓపికతో, మంచితనంతో మార్చడానికి కృషి చేయాలి. మీ ఆవిడని చెట్టాపట్టాలేసుకుని హాయిగా హుషారుగా రోడ్లమీద, పార్కుల్లో తిరగాలని మీకు ఉండవచ్చు. కాని అది ఆమెకు చిరాకైన విషయం. ఎందుకంటే ఎందరో ఉన్న చోటికి రావడం ఆమెకు ఇష్టం ఉండదు. అందుకని ముందుగా నలుగురైదుగురు ఉండే చోటికి తీసుకువెళ్ళి అక్కడ సరదాగా గడిపే వాతావరణాన్ని కలగజేయండి. ఆ సరదా రుచి తెలుసుకున్నాక ఆమె మరికాస్త పెద్ద పరిధికి తన మనస్సుని విస్తృతపరచుకుంటుంది. మీరు కాస్త ఓపిక పడితే తప్పకుండా మారుతుంది. ఆమెలో పరివర్తనం వచ్చాక సెక్స్‌లో ఫోర్ ప్లేగా మీరు చేస్తే కొత్త కొత్త ప్రేరణలు కిక్నివ్వడం ప్రారంభిస్తాయి. కొంతకాలానికి ఫోర్ ప్లేలోనే కాదు, ప్లేలో కూడా మీతో సమ ఉజ్జీ అవుతుంది. అందుకని దిగులు చెందకండి. మీలోని హుషారుని, ఆసక్తిని చంపుకోకపోతే తప్పకుండా కొంత కాలానికి ఆమె మీ దారిలోకి వస్తుంది. అందుకని మీరు ఎల్లప్పుడు హుషారుగా ఉండండి.