ప్రశ్న:- ”నా వయస్సు 70 సంవత్సరాలు. భార్య ప్రక్కనే పడుకున్నప్పటికీ సెక్స్ స్పందనలు కలగవు. నా భార్య సెక్స్ కావాలని అంటుంది. నా అంగాన్ని తన చేత్తో ప్రేరేపిస్తుంది. అయినా ఏ మాత్రం గట్టిపడటం లేదు. ఎన్ని నెలలు గడిచినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం కనబడదు. కాని ఎప్పుడైనా అనుకోకుండా వయస్సులో ఉన్న అమ్మాయితో సెక్స్‌లో పాల్గొనే అవకాశం కలిగితే క్షణాల్లో అంగం స్తంభిస్తుంది. చక్కగా సెక్స్ కూడా చేస్తాను. ఏమిటీ విచిత్రం? భార్య ఎంత అడిగినా ఏమాత్రం అంగం గట్టిపడకపోవడం, వయస్సులో ఉన్న అమ్మాయి తారసిల్లితే సెక్స్ చేయగలగడం నాకు అంతుపట్టని మిస్టరీ. వయస్సులో ఉన్న అమ్మాయి దగ్గర అంగం స్తంభించినట్టుగానే భార్య దగ్గర కూడా స్తంభించే మార్గం చెప్పండి.”
జవాబు:- ‘కొత్తొక వింత, పాతొక రోత’ అనే సామెత చందంగా ఉంది మీ మనస్తత్వం. ఎప్పుడూ ఉండే భార్యే కనుక ఆమె దగ్గర మీకు సెక్సువల్ ఫీలింగ్స్ కలగడం లేదు. అందుకనే ఆవిడ ఎంత ప్రేరేపించినా ప్రయోజనం ఉండటం లేదు. ఆవిడ మీద మోజు, క్రేజు లేకపోవడమే ఇందుకు కారణం. వయస్సులో ఉన్న అమ్మాయి పక్కకి చేరితే మీలో వెంటనే కోరిక రగులుతోంది. దాంతో సెక్స్ స్పందనలు చక్కగా కలిగి సెక్స్ చేస్తున్నారు. అంతే తప్ప మీలో సెక్స్‌పరంగా వీక్నెస్ లేదు. మీరూ, మీ ఆవిడ కౌన్సిలింగ్ పొందండి. కొన్ని శృంగార కళలు నేర్చుకోండి. దాంతో ఇద్దరి మధ్య చక్కని కమ్యూనికేషన్స్ డెవలప్ అయి సెక్స్‌లో స్పందించడం, సెక్స్‌లో పాల్గొనడం ఉంటుంది.