Friday, October 22, 2021
spot_img

పెళ్లయిన రెండేళ్లకే ఇలా అయితే…

ప్రశ్న:-   ”మా ఆయన కంప్యూటర్‌ ఇంజనీర్‌. మాకు పెళ్ళయి రెండు సంవత్సరాలైంది. పెళ్ళయిన రెండు నెలల వరకు దాంపత్య సుఖాన్ని చాలా గొప్పగా ఎంజాయ్‌ చేశాం. ఆ తర్వాత నిదానంగా మా వారికి లైంగిక సామర్థ్యం తగ్గిపోయింది. నాకు రోజుకి 2-3 సార్లు దాంపత్య సుఖం పొందాలని ఉంటుంది. కానీ మా వారికి లైంగిక అసమర్థత ఏర్పడడంతో ఇటీవల వారం – పది రోజులకి ఒకసారే పాల్గొనడం ఉంటోంది. నా గోల ఎక్కువ అయ్యేకొద్దీ ఆయన ఇంటికి ఆలస్యంగా రావడం, రాగానే భోజనం చేసి అలసిపోయానని నిద్రపోవడం చేస్తున్నారు. ఆయనకి ఇంకెవరి మీదైనా మనస్సు కలిగిందా అన్న అనుమానం కూడా నాకు కలుగుతోంది, మనస్సు విప్పి ఏదీ మాట్లాడరు. నేను ఏమి అడిగినా ముక్తసరిగా రెండు ముక్కల్లో సమాధానం చెబుతారు. నేను అడిగిన దానికి ఆయన కాస్త వివరంగానైనా చెప్పాలని ఎదురు చూస్తాను. రెండు సంవత్సరాలకే ఇలా ఉంటే, ఇంకో రెండు సంవత్సరాలకి అసలు లేకుండా అవుతుందేమోనని దిగులుగా ఉంది. మా సంసారాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్పండి.” 

జవాబు:-     ఈ ఆధునిక యుగంలో ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా మానసిక వత్తిడికి లోనవుతున్నారు. పోటీ ప్రపంచంలో అన్నింట్లోనూ పోటీ పెరగడంతో మానసిక వత్తిడి ఎక్కువ అవుతోంది. మానసిక వత్తిడి లైంగిక సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తోంది. కానీ చాలామంది అది తెలుసుకోలేకపోతున్నారు. మీవారు కూడా తమ ప్రొఫెషనల్‌లో మానసిక వత్తిడికి గురి అవుతూ ఉండాలి. అందువల్లే ఆయన దాంపత్య జీవితంలో నిరాసక్తత కలిగి ఉన్నారు, అలసిపోతున్నారు. ఇంటికి రాగానే నిద్రపోతున్నారు. మీ ప్రెషర్‌తో ఏం చెప్పాలో తెలిక ముక్తసరిగా జవాబిస్తున్నారు. ఎంత అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ పని బిజీగా ఉన్నప్పటికీ మనస్సుని రిలాక్స్‌డ్‌గా ఉంచుకోవడం నేర్చుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా మనస్సుని రిలాక్స్‌ చేసుకోవడానికి కృషి చేయాలి. చక్కని రిలాక్సేషన్‌ పొందడానికి భార్యాపిల్లలే మంచి అవకాశం. చాలామంది అది గుర్తించి ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక మానసిక వత్తిడి నుంచి బయటపడడానికి కృషి చేయాలి. ఉల్లాసంగా భార్యతో గడపాలి. దాంతో చక్కని రిలీఫ్‌ వస్తుంది. భార్య కూడా భర్తని సానుభూతితో అర్థం చేసుకోవాలి. సహకరించాలి. అంతేకాని సూటిపోటి మాటలతో మనస్సుని గాయపరచకూడదు. 

మీవారి విషయంలో మీరు సహృదయంతో వ్యవహరించండి. దంపతుల మధ్య చక్కని కమ్యూనికేషన్‌ ఉంటే ఎంతటి మానసిక వత్తిడి అయినా ఎగిరిపోతుంది. ఒకరినొకరు ఎలా ఉత్తేజపరుచుకోవాలి, సరదా కబుర్లు ఎలా చెప్పుకోవాలి, వారాంతపు రోజులని ఎలా ప్లాన్‌ చేసుకోవాలి, ఎదుటి వారిని నొప్పించకుండా ఎలా మాట్లాడాలి – ఇలాంటి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ని డెవలప్‌ చేసుకుంటే దాంపత్యం చాలా హ్యాపీగా ఉంటుంది. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!