Tuesday, October 19, 2021
spot_img

పెరుగు తినక తప్పదా?

ప్రశ్న:-   ”నేను చిన్నప్పటి నుంచి మజ్జిగ, పెరుగు వాడను. వాటిని చూస్తేనే వాంతి వస్తుంది. మజ్జిగ వాడకపోతే వేడి చేస్తుందని ఇంట్లో గోల పెడుతున్నారు. వాళ్ళ గోల పడలేక రెండు, మూడు సార్లు ట్రై చేశాను. మజ్జిగన్నం తినడం నా వల్ల కాలేదు. అప్పుడప్పుడు నాకు కాళ్ళ నొప్పులు, మూత్రంలో మంట, తలనొప్పి, కడుపులో మంట కలుగుతూ ఉంటాయి. అవన్నీ వేడి లక్షణాలని, మజ్జిగ వాడకపోవడమే ఇందుకు కారణమని పెద్దలు గోల పెడుతున్నారు. మజ్జిగ వాడకపోతే నా వేడి తగ్గదా!”

జవాబు:-     వేడి చేయడమనేది లేదు. వేడి అనుకునే లక్షణాలు వేరే పరిస్థితుల వల్ల అవుతాయి. మూత్రం మంట అనిపిస్తూ ఉంటే మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ కారణం కావచ్చు లేదా మంచినీళ్ళు తక్కువ తాగడం వల్ల మూత్రంలో లవణాలు సాంద్రత పెరిగి మ్యూనోజా ఇరిటేషన్‌ వల్ల కావచ్చు. కడుపులో మంట అనేక కారణాల వల్ల రావొచ్చు. జీర్ణాశయంలో ఆమ్లం అధికంగా తయారుకావడం వల్ల కావచ్చు. ఇలా వేడి లక్షణాలు పోతాయని అనుకోవడం ఆరోగ్యం విజ్ఞానం లేకపోవడం వల్లనే. కొందరికి మజ్జిగ వాసన పడదు. ఆ వాసన చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుంది. కొందరు పళ్ళు తినరు. ఆ పళ్ళ వాసన వాళ్ళకి ఇరిటేటింగ్‌గా ఉంటుంది. వాసన వల్ల వాటికి దూరమవుతున్నామని తెలుసుకోక పడవని అనుకుంటారు. మీకు మజ్జిగ విషయం కూడా అంతే. మజ్జిగ, పెరుగు పడనంత మాత్రాన ఏమీ అవదు. చలవ చేయడానికని బలవంతగా తీసుకుని కక్కేయనవసరం లేదు. మీ కాళ్ళ నొప్పులకి, తలనొప్పికి వేరే కారణాలు ఉంటాయి. డాక్టరుకి చూపించుకోండి. తగ్గిపోతాయి.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!