ప్రశ్న:- ”నాకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. ఇంతవరకు మా ఆవిడకు గర్భం రాలేదు. నాకు మొదటి నుంచి వీర్యం పలచగా ఉంటుంది. నేను హస్తప్రయోగం విపరీతంగా చేశాను. దానివల్లే వీర్యం పలచన అయిందా? పలచన కావడం వల్లే మా ఆవిడకి గర్భం రాకుండా అయ్యిందా? వీర్యం చిక్కన అవ్వాలంటే ఏం చేయాలి?”
జవాబు:- వీర్యం పలచగా అయినా ఉండవచ్చు. చిక్కగానైనా ఉండవచ్చు. వీర్యం నీళ్ళలాగా ఉంటే గర్భం రాదనుకోవడం అపోహ మాత్రమే. వీర్యం ఎలా ఉన్నా గర్భం వస్తుంది. గర్భం రావడానికి వీర్యంలో తగుపాళ్ళల్లో వీర్యకణాలు ఉండాలి. కొందరిలో వీర్యం చిక్కగా ఉన్నా, పలచగా ఉన్నా వీర్యకణాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్లే గర్భం రాకుండా అవుతుంది. హస్తప్రయోగంలో అతి అనేది లేదు. హస్తప్రయోగం చేసినప్పటికీ గర్భం రాకుండా పోదు. మీ విషయంలో డాక్టరుకి చూపించుకోండి. వీర్య పరీక్ష చేయించుకోండి. మీకన్నీ బాగున్నప్పటికీ ఒకవేళ మీ శ్రమలో లోపం ఉంటే గర్భం రాదు. అందుకని ఇద్దరూ ఒకేసారి డాక్టరుని సంప్రదించండి.