ప్రశ్న:- ”మా బిడ్డకి 5 సంవత్సరాలు. మెల్లకన్ను ఉంది. కొందరేమో ఆపరేషన్ చేయించు అంటున్నారు. మరికొందరేమో పిల్లకి మెల్లకన్ను అదృష్టం కలిగిస్తుంది కనుక అలాగే ఉంచేయమంటున్నారు? మీ సలహా ఏమిటి?”
జవాబు:- మెల్లకన్ను అదృష్టం కాదు. దురదృష్టం. అలాగే ఉంచేస్తే ఆ కంటికి చూపు దెబ్బతింటుంది. మెల్లన్ను ఉన్నప్పుడు వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయిస్తే చూపు చక్కగా ఉంటుంది. ఆలస్యం చేస్తే చూపు దెబ్బతింటుంది. వైద్యశాస్త్రం అభివృద్ధి చెందని రోజుల్లో మెల్లకన్నుకి ఏమీ చేయలేక అది అదృష్టంలే అని సాంత్వన కలిగించుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా అలా అనుకుని ఊరుకుంటే మూర్ఖత్వం అవుతుంది.