ప్రశ్న:- ”నేను ఒక వేశ్యను కలిశాను. వేశ్యను కలిసిన 3 రోజులకే మూత్రం మంటగా వచ్చింది. వేశ్యతో రాత్రంతా నిద్రపోకుండా పలుసార్లు సెక్స్‌లో పాల్గొన్నాను. నిద్రలేకపోవడం వల్ల వేడి చేసిందని అనుకున్నాను. ఆమె పైకి చాలా అందంగా, ఆరోగ్యంగా కనిపించింది. అందుకని ఆవిడ దగ్గిర ఏ వ్యాధులూ ఉండవని అనుకున్నాను. మూత్రం మంట తర్వాత 2 రోజుల్లో ఒక బీర్జం బాగా వాచిపోయింది. చలిజ్వరం వచ్చింది. ఈ లోపల మూత్రనాళం నుంచి చీము మొదలైంది. డాక్టరు దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మందులు ఏం వాడాలి?”
జవాబు:- వ్యాధి వచ్చినప్పుడు సిగ్గుపడి దాచుకోవడం మరింత నష్టం చేస్తుంది. వ్యాధి ఉన్నప్పుడు తప్పకుండా డాక్టరుని సంప్రదించాలి. మీకు గోనోకోకల్, క్లమిడియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ రెండింటికి వైద్యం చేయాలి. సెఫ్ట్రాక్సోన్ 1 గ్రామ్ ఇంజక్షన్ రోజుకి ఒకటి చొప్పున ఏడు రోజులు చేయించుకోవడమే కాకుండా డాక్సిసైకిలిస్ 100 యుజి క్యాప్సుల్స్ ఉదయం 1, సాయంత్రం 1 చొప్పున 14 రోజులు వాడాలి. కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే టెస్టికల్స్ వాపు, జ్వరం తగ్గిపోతాయి. ఇక ముందు ఎప్పుడూ అపరిచిత వ్యక్తులతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు. 3 నెలల తర్వాత ఒకసారి హెచ్.ఐ.వి. టెస్టు చేయించుకోండి.