ప్రశ్న:-”మాకు పెళ్ళై 10 సంవత్సరాలైంది. ఎటువంటి సమస్య లేకుండా రోజూ సెక్సులో పాల్గొంటున్నాం. ఎందుకనో వారం రోజుల క్రితం సెక్సులో పాల్గొంటున్నప్పుడు అకస్మాత్తుగా అంగం మెత్తబడింది. ఇక ఎంత ప్రయత్నించినా అంగం గట్టిపడలేదు. ఆ రోజు నుంచి ఈ వారం రోజులూ రోజూ ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయినా ఏ మాత్రం అంగం గట్టిపడటం లేదు. నాకేమైంది? నాకిలా అవడంతో భార్య కూడా ఎంతో ఆందోళనకి గురవుతోంది. రోజూ తనవంతుగా అంగాన్ని ప్రేరేపించడం, అంగచూషణ చేయడం వగైరా శక్తివంచన లేకుండా చేస్తోంది. ఎంతసేపు చేసినా ఫలితం ఉండటం అకస్మాత్తుగా నపుంసకత్వం ఎందుకు వచ్చినట్టు? ఇక నేను సెక్సుకి పనికి రాకుండా పోయానా? కొజ్జాగా మారిపోతానా? ఎంతో దిగులుగా ఉంది. నన్ను రక్షించండి.
జవాబు:- మీకు నపుంసకత్వం రాలేదు. మీరు నపుంసకులుగా మారలేదు. అకస్మాత్తుగా వచ్చే నపుంసకత్వం ఎప్పుడూ మానసికమైనదే. కొందరిలో అకస్మాత్తుగా వాళ్ళ సెక్సు సామర్థ్యం మీద అనుమానం కలుగుతుంది. దాంతో అంగం స్తంభించడం మానేస్తుంది. ఆ సైకలాజికల్ షాక్తో మరింత కృంగదీస్తుంది. తెలియని భయం వల్ల అంగం గట్టిపడలేదని తెలుసుకుని మనస్సుని శాంతపరచుకుంటే 2-3 రోజుల్లో అంతా సక్రమంగా మారుతుంది.
కొందరిలో మానసిక ఒత్తిడి, శారీరక అలసట వల్ల అంగం స్తంభించదు. ఒకవేళ స్తంభించినా మధ్యలో మెత్తబడుతుంది. దానిని తేలకగా తీసుకుని శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకుంటే 1, 2 రోజుల్లోనే అంతా మామూలు అవుతుంది. అలా కాకుండా ఎందుకిలా జరిగిందా అని తల్లడిల్లిపోతే మరింత నష్టం కలుగుతుంది. మీ విషయంలో ఇదే జరిగింది. అందుకని మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి. మీకు ఏ మందూ అవసరం లేదు. కొద్ది రోజుల్లోనే తిరిగి మామూలు అవుతారు.