Saturday, October 16, 2021
spot_img

ఆ లక్షణాలు ఇద్దరికీ ఒక్కటే

ప్రశ్న:-   ”హెచ్‌.ఐ.వి./ఎయిడ్స్‌ వల్ల పురుషుల్లో కంటే స్త్రీలలో వ్యాధులు, బాధలు ఎక్కువ ఉంటాయా? స్త్రీలలో ఎటువంటి వ్యాధులు కలిగే అవకాశం ఉంది?” 

జవాబు:-     హెచ్‌.ఐ.వి. ఇన్‌ఫెక్షన్‌ పురుషులకి వచ్చినా, స్త్రీలకి వచ్చినా వ్యాధి లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. అయితే స్త్రీలలో కొన్ని ప్రత్యేక వ్యాధులు కలుగుతాయి. వాటిల్లో వెజైనల్‌ కాండిడాసిస్‌ అనే జబ్బు ఒకటి. ఇది యోనిలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌. రోగనిరోధక శక్తి తగ్గడంతో వెజైనల్‌ కాండిడాడిస్‌ తరచూ వస్తుంది. హెచ్‌.ఐ.వి. ఉన్న స్త్రీలలో ఇమ్యూనిటీ తగ్గడంతో జననేంద్రియాల దగ్గర హెర్పిస్‌ సింప్లెక్స్‌ అనే వ్యాధి కూడా తరచూ కలుగుతుంది. ఈ వ్యాధివల్ల జననేంద్రియాల దగ్గర గుత్తులు గుత్తులుగా నీటిపొక్కులు వచ్చి పగలడం, పుండుగా తయారవడం ఉంటుంది. కొందరిలో పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ ఏర్పడి గర్భాశయం, దాని పక్కన ఉండే ట్యూబులు, ఓవరీస్‌ వాస్తాయి. ఇటువంటి పరిస్థితి వల్ల పొత్తి కడుపు బిగదీస్తుంది. జ్వరం ఉంటుంది. సెక్స్‌లో పాల్గొంటే పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. హెచ్‌.ఐ.వి. వల్ల కొందరు స్త్రీలలో మర్మావయవాల దగ్గర పులిపిరులు ఎక్కువగా వస్తాయి. మరికొందరిలో మెన్సస్‌ అస్తవ్యస్తంగా రావడమే కాకుండా బ్లీడింగ్‌ ఎక్కువ అవుతుంది. హెచ్‌.ఐ.వి. ఉన్నప్పుడు గర్భం వస్తే నిలవడం కూడా తక్కువే. హెచ్‌.ఐ.వి./ఎయిడ్స్‌ ఉన్న స్త్రీ జననేంద్రియాలకి సంబంధించిన ఏదైనా బాధ కనబడితే డాక్టర్‌ని వెంటనే సంప్రదించాలి. తగిన చికిత్సతో వ్యాధి త్వరగా తగ్గుతుంది. బాధలు అంతగా ఉండవు. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!