Friday, October 22, 2021
spot_img

క్షయ సోకినా, వారి నుంచి ఎయిడ్స్‌ రాదు

ప్రశ్న:-   ”మా ఇంట్లో ఒక హెచ్‌.ఐ.వి. రోగి ఉన్నాడు. జబ్బు బాగా ముదిరింది. అతనికి క్షయ కూడా ఉంది. మా ఇంట్లో పిల్లవానికి కూడా అతని క్షయ వ్యాధి వచ్చింది. క్షయ వ్యాధి సోకినప్పుడు అతని దగ్గు ద్వారా ఎయిడ్స్‌ వ్యాధి కూడా సోకే ప్రమాదం లేదా? ఎయిడ్స్‌ టెస్ట్‌ చేయిస్తే ఎయిడ్స్‌ లేదని వచ్చింది. భవిష్యత్తులో ఎయిడ్స్‌ బయటపడే ప్రమాదం ఉందా?”

జవాబు:-     క్షయ వ్యాధి దగ్గడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకడం సహజమే. ఎయిడ్స్‌ రోగికి క్షయవ్యాధి ఉండి అతను దగ్గగా మరొకరికి ఆ వ్యాధి రావచ్చు. కాని అతనిలోని ఎయిడ్స్‌ వ్యాధి మాత్రం అలా సోకదు. ఎయిడ్స్‌ వ్యాధి దగ్గడం, తుమ్మడం ద్వారా రానే రాదు. ఎయిడ్స్‌ వ్యాధి కేవలం లైంగిక సంపర్కం ద్వారానూ, ఆ రోగి రక్తాన్ని ఎక్కించడం ద్వారానూ, ఆ రోగికి చేసిన ఇంజక్షను సూదులని శుభ్రపరచకుండా మరొకరికి వెంటనే చేయడం ద్వారానూ, తల్లికి ఎయిడ్స్‌ ఉంటే గర్భంలో ఉండగానో, కాన్పు సమయంలోనో శిశువుకి రావడమే తప్ప మరొక విధంగా రాదు. అందుకని ఎయిడ్స్‌ రోగి ఇంట్లో ఉన్నప్పటికీ ఆ వ్యాధి సోకుతుందని ఏ మాత్రం భయపడనవసరం లేదు.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!