ప్రశ్న:- ”నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది. అది తప్పు అనిపించి ఎంత మానాలనుకున్నా మానలేకపోతున్నాను. సెక్స్ కోరికలు విపరీతం అయినప్పుడు హస్తప్రయోగం చేస్తున్నాను. వీర్యం పోయినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది గాని ఆ తర్వాత కొన్ని గంటల పాటు తలనొప్పి వస్తుంది. హస్తప్రయోగం చేయకపోతే తలనొప్పి ఉండదు. హస్తప్రయోగం చేయడం వల్ల మెదడులో నరాలు తగ్గిపోతున్నాయా? ఈ రకంగా మెదడులో నరాలు డ్యామేజి అవుతుంటే పక్షవాతం వచ్చి మంచాన పడతానా? ఎంతో భయంగా ఉంది. హస్తప్రయోగం మానడానికి మార్గం చెప్పండి.”
జవాబు:- హస్త ప్రయోగం ఏమాత్రం హానికరం కాదు. యుక్త వయస్సు వచ్చిన దగ్గర నుంచి ఎందరికో ఈ అలవాటు ఉంటుంది. హస్తప్రయోగం చేయడం వల్ల మెదడులో నరాలు దెబ్బతింటాయని, హస్తప్రయోగం హాని చేస్తుందని ఎవరైనా చెబితే పూర్తిగా తప్పు. అలా చెప్పేవాళ్ళకి సెక్స్ విజ్ఞానం లేదని అనుకోవాలి. మీ విషయంలో ఏదో చేయకూడని తప్పు చేస్తున్నాననే ఆలోచన బలీయంగా ఉంది. హస్తప్రయోగం చేస్తే నరాలు దెబ్బతింటాయనే భయం తీవ్రంగా ఉంది. అయినా కోరిక తట్టుకోలేక హస్తప్రయోగం చేస్తున్నారు. అది అయిపోగానే చేసిన దానికి ఏదో జరగరాని హాని జరిగిపోతుందనే టెన్షన్‌కి లోనవుతున్నారు. టెన్షన్ ఫీలవడంతో మీలో టెన్షన్ హెడేక్ వస్తోంది. మీరు టెన్షన్ ఫీల్ అవడం లేదని అనుకోవచ్చు. కాని సబ్ కాన్షియస్గా చేయకూడని తప్పు చేస్తున్నాననే భయం ఉంది. దానికి కారణం మీలో హస్తప్రయోగం గురించి అర్థంలేని అనుమానాలు, భయాలు ఉండటమే. హస్తప్రయోగం ఏమాత్రం తప్పు కాదు. దానివల్ల నష్టం జరగదు. అందుకని నిర్భయంగా ఉండండి. కోరిక కలిగినప్పుడు హస్తప్రయోగం చేయండి. ఏదో జరగరాని నష్టం జరుగుతుందని అనుకోకండి. మీకు ప్రత్యేకంగా ఎటువంటి చికిత్స అవసరం లేదు.