ప్రశ్న:-”ఇటీవల కొద్ది రోజులుగా మూత్రం మంటగా వస్తోంది. ఈ బాధ రావడానికి కొద్ది రోజుల ముందు సినిమా హాలులో అందరితో పాటు మూత్ర విసర్జన చేశాను. దానివల్ల గనేరియా జబ్బు సంక్రమించిందా? ఇప్పుడు నా గతి ఏమిటి?”
జవాబు:- ఒకరు మూత్ర విసర్జన చేసిన చోటులో మరొకరు మూత్ర విసర్జన చేయడం వల్ల సుఖవ్యాధులు రావు. సుఖవ్యాధులు సెక్స్‌లో పాల్గొంటేనే వస్తాయి. లేదా సుఖవ్యాధులకి సంబంధించిన చీముని నేరుగా జననేంద్రియాలకి పూసుకుంటే వస్తాయి. అంతేతప్ప మరోవిధంగా రావు. మీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. ఇది సుఖవ్యాధి కాదు. యూరినరీ ట్రాన్ ఇన్ఫెక్షన్లో కూడా మూత్రం మాటిమాటికీ రావడం, మంట పుట్టడం ఉంటాయి. మీ విషయంలో డాక్టరుకు చూపించుకుని మందులు వాడండి. తేలికగా వ్యాధి తగ్గిపోతుంది.