ప్రశ్న:- ”నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది. అంగం చిన్నదై పోయిందని అనుమానం. పూర్వం ఇంత చిన్నదిగా కనిపించేది కాదు. మళ్ళీ పెద్దది అవ్వాలంటే ఏం చెయ్యాలి? హస్తప్రయోగం మానాలని ప్రయత్నించినా అప్రయత్నంగా అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నాను. అంగం చిన్నదైపోతే స్త్రీకి తృప్తి ఉండదని అంటున్నారు. నా బ్రతుకు అడవి కాచిన వెన్నెలేనా?”
జవాబు:- హస్తప్రయోగం వల్ల అంగం చిన్నది అవదు. ఎంత చిన్నప్పటి నుంచి చేసినా, రోజుకి ఎన్నిసార్లు చేసినా, ఎంత వీర్యం పోయినప్పటికీ అంగం చిన్నదవ్వదు. అనవసరంగా హస్తప్రయోగం గురించి ఉన్న భయంవల్ల, భ్రాంతి మనస్తత్వం పెంపొందింది మీలో. దానివల్ల అంగం చిన్నదైనట్లు కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగం చిన్నదవడం, కృశించడం ఉండదు. హస్తప్రయోగానికి భయపడనవసరం లేదు. మీ దాంపత్య జీవితం తప్పకుండా చక్కగా ఉంటుంది.