Saturday, October 16, 2021
spot_img

ఈస్ట్రోజన్‌ వాడండి!

ప్రశ్న:- ”నా వయస్సు 60 సంవత్సరాలు. ఇటీవల మా వారితో సెక్సులో పాల్గొంటూ ఉంటే అప్పుడప్పుడు కాస్త రక్తం వస్తోంది. చీరకి రక్తం మరకలు ఏర్పడుతున్నాయి. సెక్స్‌ కూడా బాధ అనిపిస్తుంది. అయినా నాలో సెక్స్‌ యావ చావలేదు. నొప్పి అనిపిస్తుందని తెలిసి ఉండి కూడా కోరిక ఫోర్సు చేయడంతో మా వారితో సెక్స్‌లో పాల్గొంటున్నాను. లేడీ డాక్టరు దగ్గరకి వెళ్ళి సెక్స్‌లో ఉన్నప్పుడు రక్తం మరకలు ఏర్పడుతున్నాయని చెప్పాను. ఆవిడ లోపల పరీక్ష చేసి కేన్సరు వంటివి లేవని చెప్పారు. ఏదో ఆయింటుమెంటు రాసుకోమని రాసిచ్చారు. నేను వాడలేదు. ఆవిడ నన్ను క్షుణ్ణంగా పరీక్ష చేయలేదని అనుకున్నాను. లేడీ డాక్టర్‌ చెప్పినట్లు నిజంగానే నాకు కేన్సరు లేనట్టేనా?” 

జవాబు:- మెనోపాజ్‌ వచ్చిన తరువాత ఈస్ట్రోజిన్‌ హార్మోను తగ్గిపోయి యోని లోపల పొరలు పలచన అవుతాయి. దానివల్ల సెక్స్‌లో పాల్గొన్నప్పుడు రుద్దుకుపోయి రక్తం కొద్దిగా కనబడుతుంది. అదే అయి ఉంటుంది. సెర్విక్స్‌కి కేన్సరు పుండు ఉన్నా, యోని మార్గంలో ఉన్నా పరీక్షలో తెలుస్తుంది. యోని పొరలు పలచన అయినప్పుడు ఈస్ట్రోజన్‌ ఆయింటుమెంటు యోని లోపల రాయడం, బిల్ళలు వాడటం చేస్తే కారడం ఉండదు. మీకు కేన్సరు కాదు. మీ డాక్టరు చెప్పినట్లు చేయండి. మీరు నిర్భయంగానే దాంపత్య సంబంధాలలో పాల్గొనండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!