ప్రశ్న:-”నా వయస్సు 18 సంవత్సరాలు. నాదొక వింత సమస్య. నేను మగవాడినే అయినప్పటికీ శరీరం ఆకృతి కొంత స్త్రీలాగా ఉంటుంది. స్నేహితులు ‘ముద్దు వస్తున్నావే’ అంటూ ఆడదాన్ని అన్నట్టుగా గేలి చేస్తున్నారు. కాలేజీకి వెళ్ళడానికి సిగ్గుగా ఉంది. చనిపోవాలని ఉంది. నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నాను. నేనెందుకని ఇలా తయారయ్యాను? అందరిలాటి మగవాడిగా అవగలనా?”
జవాబు:- కొందరు అబ్బాయిల్లో జీన్స్ లోపం లేదా సెక్స్ హార్మోన్ల లోపం ఉంటుంది. దాంతో మగవాడే అయినప్పటికీ స్త్రీ ఆకృతి కొంత ఏర్పడుతుంది. కారియో టైపింగ్, హార్మోన్ టెస్టులు చేయించుకుని అవసరాన్ని బట్టి మేల్ సెక్స్ హార్మోన్లు వాడితే పూర్తిగా మామూలు అవుతారు. కొందరిలో అరుదుగా ఫీమేల్ గ్రంథులు కూడా ఉంటాయి. వైద్య పరీక్షలు చేయిస్తే అవి ఉన్నవీ, లేనివీ తెలుస్తుంది. ఒకవేళ ఫీమేల్ సెక్స్ గ్లాండ్స్ ఉంటే, వాటిని తొలగిస్తే మామూలు అవుతారు. ఒక్కసారి డాక్టరుకి చూపించుకుని పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోండి. అనవసరంగా దిగులు చెందకండి.