ప్రశ్న:- ”నా వయస్సు 18 సంవత్సరాలు. నా ఫ్రెండ్స్‌తో పోల్చుకుంటే నా వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయి. నా ఛాతీ ఫ్లాట్ అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్‌కి లాగానే నా వక్షోజాలు నిండుగా ఉండాలి. అవి పెద్దవిగా తయారయ్యేందుకు మందులు, ఇంజక్షన్లు రాయండి. మీ మేలు ఎప్పటికీ మరచిపోను.”
జవాబు:-వక్షోజాలు పరిమాణం పెరగటానికి ప్రత్యేకంగా మందులు, ఇంజక్షన్లు ఏమీ లేవు. కొందరు అమ్మాయిలకి సహజంగానే పెద్దవిగా ఉంటే మరికొందరికి కాస్త చిన్నవిగా ఉంటాయి. చిన్నవిగా ఉన్నంత మాత్రాన ఇన్‌ఫీరియారిటీ ఫీల్ అవడం సరికాదు. స్పాంజి బ్రా వాడటం, ఉన్నవాటితోనే ఛెస్ట్ కాస్త ఎత్తుగా, ఎట్రాక్టివ్‌గా ఉండేటట్లు బ్రా కుట్టించుకోవడం చేస్తే దిగులు వదిలిపోతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ మీ కంటే వక్షోజాలు పెద్దవి ఉండి ఉండవు. వాళ్ళల్లో చాలామంది ఛెస్ట్ ఎట్రాక్టివ్‌గా కనబడేటట్లు బ్రా వేసుకుంటూ ఉంటారు. మీరు అది తెలుసుకోక మీకేదో తక్కువైనట్టు అనవసరంగా దిగులు చెందుతున్నారు. అందంగా కనబడాలనుకోవడం తప్పుకాదు. కాని అనవసరంగా దిగులు చెందడం అర్థం లేనిది.