Saturday, October 16, 2021
spot_img

హెచ్‌.ఐ.వి. ఉంటేనేం?

ప్రశ్న:-”నాకు హెచ్‌.ఐ.వి. ఉంది. భార్యకు కూడా ఉంది. భార్య బాగా నీరసపడింది. భార్యకు రోజూ జ్వరం వస్తోంది. దగ్గు ఉంది. నాకు ప్రస్తుతానికి ఏ బాధలూ లేవు. భార్యకి అనారోగ్యం ఉండటంతో మా ఇద్దరి మధ్య సెక్స్‌ సంబంధం లేదు. నాలో సెక్స్‌ కోరికలు తరచూ కలుగుతున్నాయి. భార్యతో కలవడం కుదరదు కనుక హస్తప్రయోగం చేసుకుని సెక్స్‌ కోరిక తీర్చుకుంటున్నాను. ఇటీవల ఈ విషయం నా స్నేహితుడితో చెబితే ఎయిడ్స్‌ రోగి హస్తప్రయోగం చేస్తే మరింత బలహీనపడతాడని, రోగం ముదురుతుందని అన్నాడు. అతను అలా అన్నాడని హస్తప్రయోగం చేయకుండా కొద్దిరోజులు ఉండగలిగాను. కాని మళ్ళీ మొదలుపెట్టాను. నాకు తెలియక అడుగుతున్నాను – హస్తప్రయోగం చేయకుండా ఏ స్త్రీతోనైనా సెక్స్‌లో పాల్గొంటే నష్టం ఉండదా? మరొకటి కూడా అడుగుతున్నాను. ఎయిడ్స్‌ రోగిలో వీర్యంపోతే బలం మరింత పోతుందా?” 

జవాబు:- హెచ్‌.ఐ.వి./ఎయిడ్స్‌ ఉన్నప్పటికీ ఓపిక ఉంటే మామూలుగానే సెక్స్‌లో పాల్గొనవచ్చు. సెక్స్‌కి దూరంగా ఉండనవసరం లేదు. వీర్యం ఎంత పోయినప్పటికీ బలహీనపడటం ఉండదు. వీర్యం ఏమాత్రం విలువైనది కాదు. వీర్యంపోతే బలం పోయినట్టు కాదు. హెచ్‌.ఐ.వి./ఎయిడ్స్‌ రోగి హస్తప్రయోగం చేయడం వల్ల ఎటువంటి నష్టం లేదు. అందుకని మీరు హస్తప్రయోగాన్ని ఆపనవసరం లేదు. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!