ప్రశ్న:- ”మగవాళ్ళకి మొలతాడు ఉండటం తప్పనిసరా? మొలతాడు లేకపోతే బీర్జాలు జారిపోతాయా? అలాగే మగవాడు తప్పకుండా డ్రాయరు వేసుకోవాలా? లంగోటి కట్టుకోవాలా? అలా చేయకపోతే సెక్స్ బలహీనత ఏర్పడుతుందా?”
జవాబు:- మొలతాడు అనేది లాగు, లుంగీ, పంచె జారిపోకుండా కట్టుకోవడానికి ఉపయోగపడుతుందే తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు. బెల్టు పెట్టుకునేటప్పుడు మొలతాడు అవసరమే లేదు. లాగు జారిపోకుండా నడుం దగ్గర టైట్‌గా ఉన్నా, పంచెని బిగించి కట్టినా బెల్టు అవసరం కూడా లేదు. మొలతాడు లేకపోతే మగవాడికి బీర్జాలు జారిపోతాయని అనడంలో అర్థంలేదు. మగవాడికి మొలతాడు ఉండి తీరాలనేది మూఢనమ్మకమే తప్ప దానిలో ఎటువంటి సైంటిఫిక్ ప్రయోజనం లేదు. అలాగే మగవాడు డ్రాయరు, లంగోటి వేసుకోవడం కంఫర్ట్ ఫీలింగ్ కోసమే తప్ప అనవసరముండికాస్త్ర. డ్రాయరు లేదా లంగోటి వేసుకోకపోతే బీర్జాలు జారిపోతాయి అనే దానిలోనూ అర్థం లేదు. డ్రాయరు వేసుకోకపోయినా, లంగోటి కట్టుకోకపోయినా ఏమీ నష్టం లేదు. ఎవరి వీలు వారిది. ఎవరి కంఫర్ట్ వాళ్ళది.