ప్రశ్న:- ”నా వయస్సు 19 సంవత్సరాలు. అప్పుడప్పుడస్త్రు నిద్రలో వీర్యం పడిపోతుంది. సాధారణంగా అమ్మాయిలకి సంబంధించిన కలలు వచ్చి వీర్యం కారిపోతుందని విన్నాను. కాని నాకు అటువంటి కలలు రావడం లేదు. అయినా ఉదయం లేచేసరికి దుస్తుల మీద వీర్యం కారిన మచ్చలు కనబడుతున్నాయి. అమ్మాయిలకు సంబంధించిన కలలు రాకుండా ఆటోమేటిక్‌గా వీర్యం పడిపోవడం నరాల బలహీనతకి చిహ్నమా? ఈ నరాల బలహీనత నేను పెళ్ళి చేసుకున్న తర్వాత సెక్స్‌లో అసంతృప్తికి కారణం అవుతుందా?”
జవాబు:- చాలామందికి కలలు వచ్చినా లేచిన తర్వాత కలలు వచ్చినట్టుగా గుర్తు ఉండదు. కలలు రాకుండా కూడా వీర్యస్ఖలనం కావచ్చు. శుక్రకోశాలు వీర్యంతో నిండిపోతే వీర్యం లీక్ అవుతుంది. ఇదేమీ నరాల బలహీనత కాదు. వీర్యం ఎలా పోయినా, ఎంత పోయినా భయపడనవసరం లేదు. వీర్యం విలువైంది కాదు. వీర్య నష్టం వైవాహిక జీవితంలో ఎటువంటి బలహీనతను తీసుకురాదు. అందుకని మీరు దిగులు చెందనవసరం లేదు.