ప్రశ్న:- ”నా వయస్సు 36 సంవత్సరాలు. పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు వున్నారు. నా సమస్య ఏమిటంటే గత 2 సంవత్సరాల నుండి సెక్స్ సమయంలో వీర్యము స్ఖలించినప్పుడు కలిగే అనిర్వచనీయమైన థ్రిల్ నాకు ఏమీ అనిపించడం లేదు. మామూలుగా అవుట్ అయిపోతుంది. ఇంతకుముందు ఆ థ్రిల్ చాలా బాగుండేది. ప్రస్తుతము అంగము పైన అక్కడక్కడ నల్లటి మచ్చలు లాంటివి ఏర్పడ్డాయి. ఇదేమైనా షుగర్ వ్యాధి లోపమా? సికింద్రాబాద్‌లో ఒక సెక్స్ స్పెషలిస్ట్‌ను సంప్రదిస్తే ఇది నరాల బలహీనత అని చెప్పాడు. నాకు నమ్మకం కుదరలేదు. అందుకే మీకు లెటర్ వ్రాస్తున్నాను. నాకు పూర్వంలాగా క్లైమాక్స్‌లో సంపూర్ణ తృప్తి కలగాలంటే ఏమి చేయాలి? దానికి ఏమైనా మందులు వుంటే తెలియజేయగలరు?”
జవాబు:- మీకు ఎటువంటి నరాల బలహీనత లేదు. మీది కేవలం సైకలాజికల్ ప్రాబ్లమ్. పూర్వం సెక్స్‌లో థ్రిల్ పొంది, ఇప్పుడు పొందకపోవడానికి భార్యాభర్తలిద్దరూ సెక్స్‌ని రొటీన్ విషయంగా తీసుకోవడమే కారణం. సంభోగం అనేది సమభాగస్వామ్యం మరియు సమభోగం కూడా. ఫోర్‌ప్లేకి ఎక్కువ సమయం కేటాయించాలి. ఎటువంటి సంకోచాలు లేకుండా దంపతులిద్దరూ హుషారుగా ముద్దుముచ్చట్లలో పాల్గొనాలి. స్త్రీకి సుఖం అందించవలసిన బాధ్యత పురుషునిదే అనుకుని స్త్రీ సెక్స్‌లో యాక్టివ్ పార్టు తీసుకోకపోతే శృంగారం యాంత్రికంగా మారుతుంది. శృంగారం యాంత్రికంగా మారితే వీర్యస్ఖలనం అయినప్పటికీ థ్రిల్ ఉండదు. అప్పుడు థ్రిల్ మీ సొంతం అవుతుంది. అంగంపైన అక్కడక్కడ నల్లటి మచ్చలు ఏర్పడటం జబ్బుకు సంబంధించినవి కావు. మీకు ఇతరత్రా వేరే అనుమానం ఉంటే షుగరు పరీక్ష చేయించండి. షుగరు ఉంటే మందులు వాడండి.