ప్రశ్న:- ”నేను హౌస్‌వైఫ్‌ని. పెళ్ళై 4 సంవత్సరాలైంది. నాకు మొదటి నుంచి పురుషుని మర్మావయవాలని చేతితో తాకాలని, ముద్దాడాలని, ప్రేరేపించాలని ఉంటుంది. మా వారు ఏనాడూ ఆ అవకాశం ఇవ్వలేదు. బెడ్ మీదకి చేరగానే క్షణాల్లో సెక్స్‌లో పాల్గొని చల్లబడిపోతారు. పక్కకి తిరిగి పడుకుంటారు. సెక్స్‌లో పాల్గొనేటప్పుడు బెడ్రూం లైటు కూడా తీసేస్తారు. చీకటిలో సెక్స్ చేయడం వల్ల నాకు ఏమీ కనిపించదు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు అంతా చూడాలనిపిస్తుంది. ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చూడాలని ఉంటుంది. కానీ ఇవేవీ వారికి నచ్చవు. అందుకని పగలు సెక్స్‌లో పాల్గొనాలని, అప్పుడు నేను అనుకున్నట్టు ఎంజాయ్ చేయవచ్చని మనస్సు కొట్టుకుంటుంది. అటువంటి ఆలోచన కలగానే మిగిలిపోతోంది. ఏం మొగుడో అర్థం కావటం లేదు. ఒకటి, రెండుసార్లు నోరువిప్పి మనసులో మాట చెబితే వినేసి ఊరుకున్నారు గాని అలా ఏమీ చేయలేదు. నా కోరిక తీరేదెలా? మనస్సు తృప్తి చెందేదెలా?”
జవాబు:- భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్స్ లేకపోవడం వల్ల, మనస్సు విప్పి మాట్లాడే వాతావరణం లేకపోవడం వల్ల చాలా చిన్న చిన్న కోరికలే అసంతృప్తికి దారితీస్తాయి. దాంపత్యంలో ప్రేమతో దగ్గరై ఒకరికొకరు చొరవ తీసుకుని మనస్సులోని మాటని చెప్పడం, దాన్ని సాకారం చేసుకోవడం అవసరం. కొందరు మగవాళ్ళల్లో, అలాగే కొందరు ఆడవాళ్ళల్లో కొన్ని ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని కవర్ చేసుకోవడం కోసం వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ రెండవ వాళ్ళ మాట పట్టించుకోరు. అటువంటి కాంప్లెక్స్ ఫీలింగ్స్‌ని గమనించి మెలకువగా వ్యవహరించాలి. ఏమైనప్పటికీ దంపతులిద్దరి మధ్య సెక్స్ విషయాలు మనస్సు విప్పి మాట్లాడే పరిస్థితి ఉండాలి. అందుకు కృషిచేయాలి.