Tuesday, October 19, 2021
spot_img

గోధుమతోనే షుగర్‌ తగ్గదు

ప్రశ్న:-   ”నాకు షుగరు ఉంది. వరి అన్నం మానేసి గోధుమ అన్నం తింటే షుగరు తగ్గిపోతుందని అంటున్నారు. గోధుమ అన్నం తింటే షుగరు తగ్గిపోతుందా? లేదా పెరగకుండా ఉంటుందా?”

జవాబు:-     వరి అన్నం మానేసి గోధుమ అన్నం తిన్నంత మాత్రాన షుగరు తగ్గిపోదు. షుగరు పెరగడం ఆగిపోదు. షుగరు ఉన్న వాళ్ళు పిండి పదార్థం ఉన్న వాటిని బాగా తక్కువ భుజించాలి. గోధుమల్లోనైనా, జొన్నలలోనైనా, బియ్యంలోనైనా పిండి పదార్థం దాదాపు ఒకే శాతంలో ఉంటుంది. అందుకని దేన్ని భుజించినా తక్కువే తినాలి. గోధుమలు, జొన్నలు అలవాటు లేనివి గనుక తక్కువ తింటారనే ఉద్ధేశంతో వరి అన్నం మానేసి గోధుమలు, జొన్నలు తినమని కొందరు సలహా ఇస్తారు. అంతే తప్ప అలా తినడం వలన షుగరు తగ్గదు. మీరు వరి అన్నం తిన్నప్పటికీ తగ్గించి తినండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!