ప్రశ్న:- ”నేను, నా స్నేహితుడు ఒక విషయంపై తెగ వాదించుకున్నాం. అతను మగవాళ్ళకు సెక్సువల్ ఫీలింగ్స్ ఎక్కువ అంటాడు. అందుకనే మగవాళ్ళు రేప్‌లు చేయడం, అమ్మాయిల దగ్గరికిపోవడం ఉందంటాడు. నేను మాత్రం అతని మాటని ఒప్పుకోలేదు. అమ్మాయిలకే సెక్స్ ఎక్కువని, తట్టుకోలేక నానా ఇబ్బంది పడతారని, తలారా చల్లటి నీళ్ళు పోసుకుంటారని అన్నాను. సెక్స్ ఆడవారిలో ఎక్కువా, మగవారిలో ఎక్కువా?”
జవాబు:- సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. లింగభేదమే తప్ప అన్నింట్లోను సమ ఉజ్జీలే. స్త్రీ పురుషులిద్దరిలోనూ సెక్స్ కోరికలు ఒకలాగానే ఉంటాయి. అయితే సమాజంలో ఆచారాలు, సాంప్రదాయాలు పేరిట స్త్రీని అణచిపెట్టి ఉంచటం వల్ల, మగవాని కంటే తక్కువగా చూడటం వల్ల ఆమె మనస్సుని చంపుకుని ఉంటోంది. పురుషాధిక్య సమాజంలో మగవాని మాట ఎక్కువ చెల్లుబాటవడం వల్ల సెక్స్ విషయంలో కూడా అతను స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నాడు. దానికితోడు శారీరకంగా కాస్త బలవంతుడు కనుక జబర్దస్తీగా వ్యవహరిస్తూ, తానే మిన్న అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అందుకే రేప్‌లు చేస్తున్నాడు. అంతే తప్ప పురుషునిలో స్త్రీ కంటే సెక్స్ ఎక్కువ ఉండటం కాదు. స్త్రీ తనలోని సెక్సువల్ ఫీలింగ్స్‌ని చంపుకుని బ్రతుకుతోంది కనుక తక్కువ సెక్స్ ఉన్నట్టు కనబడుతుంది. ఇద్దరికీ స్వేచ్ఛాయుత వాతావరణం, సమాజంలో గౌరవప్రదమైన వాతావరణం కలిగిస్తే సెక్స్ విషయంలో ఇద్దరూ ఒకలాగానే స్పందిస్తారు. ఏదియేమైనా ఆరోగ్యకరమైన సామాజిక సంబంధాలు కొరకు స్త్రీలైనా, పురుషులైనా సెక్సువల్ ఫీలింగ్స్‌ని అదుపులో ఉంచుకోవడం అవసరం.