Friday, October 22, 2021
spot_img

ఆమెలో ఎందుకా విసుగు?

ప్రశ్న:-   ”నా వయస్సు 60 సంవత్సరాలు. మా ఆవిడ వయస్సు 55 సంవత్సరాలు. నిన్న, మొన్నటి దాకా మేమిద్దరం దాంపత్య జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నాం. మాకిద్దరు అబ్బాయిలు. పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ఇంతవరకూ అత్తా కోడళ్ళ మధ్య ఎటువంటి గొడవలూ లేవు. కానీ ఇటీవల మా ఆవిడ కోడళ్ళ మీద విసుక్కోవడం, అరవడం ఎక్కువైంది. మొదట్లో కోడళ్ళు ఊరుకున్నారు గానీ ఇప్పుడు వాళ్ళూ ఎదురుచెప్పడం నేర్చుకున్నారు. కుటుంబ వాతావరణమంతా చెడిపోయింది. చివరికి మా ఇద్దరి మధ్య కూడా సెక్స్‌ సంబంధం లేకుండా పోయింది. సెక్స్‌ సామర్థ్యం ఉండి కూడా సెక్స్‌కి దూరంగా ఉండవలసి వస్తోంది. ఎందుకంటే పడక గదిలోకి విసుగ్గా వస్తోంది. అలసిపోయినట్టు కనపడుతుంది. ఇక నాకు మూడ్‌ ఉండదు. ఈ వైపరీత్యం ఏమిటో నాకు అంతుపట్టడం లేదు. మా సంసారం సంతోషకరంగా మారే మార్గం ఉందా?”

జవాబు:-     55-60 సంవత్సరాలు వచ్చేసరికి స్త్రీలల్లో బహిష్టులు శాశ్వతంగా ఆగిపోయి మెనోపాజ్‌ చోటు చేసుకుంటాయి. మెనోపాజ్‌ వల్ల అనేక శారీరక, మానసిక మార్పులు కలుగుతాయి. చిన్నపనికే అలసిపోవడం, నీరసం, ఒంట్లో నుంచి ఆవిర్లు రావడం, అధికంగా చెమటలు పోయడం ఉంటాయి. అలాగే అయిన దానికీ, కాని దానికీ చిరాకు పడటం, విసుక్కోవటం, కోపం రావడం కూడా ఉంటాయి. మనస్సుని సరిపెట్టుకోవడం తగ్గిపోయింది. దాంతో ఇతరులతో ఘర్షణలు తలెత్తుతాయి. అలాగే సెక్స్‌ ఎడల ఆసక్తి తగ్గిపోతుంది. మీ ఆవిడ విషయంలో మెనోపాజ్‌ కారణం కావచ్చు. ఆమెను డాక్టరు దగ్గరికి తీసుకు వెళ్ళి విషయాలన్నీ చెప్పండి. మెనోపాజ్‌కి చికిత్స చేస్తే ఆమె మళ్ళీ మామూలు అవుతుంది. మీ సంసారంలో ఇబ్బందులు తొలగిపోతాయి.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!