ప్రశ్న:- ”నా వయస్సు 25 సంవత్సరాలు. ఈ మధ్యనే కొత్తగా పెళ్ళి అయింది. నా భార్య చాలా మంచిది. నాది శీఘ్రస్ఖలనం సమస్య. గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టగానే స్ఖలనం జరుగుతుంది. కాసేపటికి అంగం గట్టి పడగానే అంగప్రవేశం జరిపితే కొద్ది సెకండ్లలోనే స్ఖలనం జరిగిపోతుంది. దానివల్ల నాకూ, నా భార్యకు సుఖం లేకుండా పోతుంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలపండి. అంగప్రవేశానికి ముందు తనని చాలా ఉత్తేజపరుస్తాను. కాని తను అంగప్రవేశంతోనే ఎక్కువ ఆనందం పొందుతుంది. టైట్‌గా వుండటం వల్ల అంగప్రవేశం కష్టమై అంగం చిట్లుతోంది. నాకు ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు. కాని నాకే ఎందుకిలా. దయచేసి మార్గం చూపండి ప్లీజ్. కనీసం కండోమ్ ఎలా వాడాలో తెలియదు.”
జవాబు:- పెళ్ళైన కొత్తలో శీఘ్రస్ఖలనం సమస్య చాలామందిలో కనబడుతుంది. మనస్సులో తెలియకుండా చోటు చేసుకున్న కంగారు, ఆందోళన, భయం శీఘ్రస్ఖలనం అవడానికి కొంత కారణం కాగా, సెక్సువల్‌గా బాగా ఉద్వేగం చెందడం మరొక కారణం. చాలామందిలో రోజులు గడుస్తున్న కొద్దీ శీఘ్రస్ఖలనం సమస్య ఎటువంటి మందుల అవసరం లేకుండా తగ్గిపోతుంది. శీఘ్రస్ఖలనం సమస్య వదలకుండా వెంటాడుతూ వుంటే డాక్టరు సలహాపై ఫ్లూ ఆక్సిటిన్, ఎసిటలోప్రిన్ మందులు వాడితే తగ్గిపోతుంది. మగవాళ్ళల్లోని శీఘ్రస్ఖలనం సమస్య ఆడవాళ్ళకు సెక్స్‌లో అసంతృప్తిని మిగుల్చుతుంది. సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ శీఘ్రస్ఖలనం అవడంతో స్త్రీకి ఒక విధమైన విసుగు వచ్చి సెక్స్‌లో ఎగ్జైట్ అవడం మానేసి, ఫ్రిజిడిటి చోటుచేసుకుంటుంది. సెక్స్‌లో స్త్రీ ఉద్రిక్తత చెందకపోతే యోని కూడా లూజు అవదు. టైట్‌గానే ఉంటుంది. దాంతో యోని మార్గంలో ద్రవాలు తగినంత ఉత్పత్తి కావు. ఇటువంటి పరిస్థితిలో సెక్స్‌లో పాల్గొంటే అంగం ఒరుసుకుపోయినట్లు అవుతుంది. అదే మీకు జరుగుతుంది. జి-స్పాట్ స్త్రీ యోని లోపల పై గోడల్లో యోని ద్వారానికి అంగుళమున్నర లోపల ఉంటుంది. జి-స్పాట్‌ని ఫింగరింగ్ ద్వారా ఉత్తేజపరచవచ్చు. ఫోర్‌ప్లే సమయంలో చూపుడు వేలిని యోని లోపలికి పోనిచ్చి మృదువుగా రుద్దితే జి-స్పాట్ ప్రేరణ పొందుతుంది. జి-స్పాట్ ప్రేరణ పొందిన వారిలో యోని పై గోడల్లో వేరుశనగ గింజంత లేదా చింతగింజంత బొడిప తయారవుతుంది. సెక్స్ పూర్తి అయిన కొద్ది సేపటిలో మళ్ళీ ఆ బొడిపె కనపడదు. అంగప్రవేశం చేసేటప్పుడు పురుషాంగ పూర్వచర్మం శిశ్నం వెనక్కి లాగి చేయాలి. మీరు వ్యాయామం చేయడానికి మీకు ఎదురైన సమస్యకీ సంబంధం లేదు. మీ విషయంలో ఒకసారి డాక్టరుని సంప్రదించండి.