Friday, October 22, 2021
spot_img

ఆమెకు ఎందుకంత విరక్తి

ప్రశ్న:-   ”నా భార్య వయస్సు 50 సంవత్సరాలు. నా వయస్సు 60 సంవత్సరాలు. నాకు ఇంకా సెక్సు కోరికలు, సామర్థ్యం బాగానే ఉన్నాయి. రోజూ కాకపోయినా 3-4 రోజులకి ఒకసారి సెక్సులో పాల్గొనాలనిపిస్తుంది. నా భార్యకి పూర్వం సెక్స్‌ ఇంట్రస్టు బాగానే ఉండేది. ఇప్పుడు అందులో ఇంట్రస్టు పూర్తిగా పోయింది. నేను ఆమెను దగ్గరికి తీసుకుంటే విసుక్కుంటుంది. దాంతో నా మూడ్‌ అంతా పోతుంది. అయినా అది పట్టించుకోకుండా బలవంతంగా సెక్స్‌ చేస్తే సెక్స్‌లో నొప్పి కలిగిన దానిలాగా కళ్ళవెంట నీళ్ళు పెట్టుకుంటుంది. కోరిక తీరిందన్న తృప్తికంటే ఆమె తీరు ఎక్కువ బాధ కలిగిస్తుంది. నా మీద ఆవిడకి అంత విరక్తి ఎందుకు కలిగిందో తెలియడం లేదు. ఇంట్లో నాకు కావలసినవన్నీ చక్కగా చేసి పెడుతుంది. సెక్స్‌ విషయంలోనే నా మీద విరక్తి. నేను దగ్గరికి వెళ్ళకపోతే ఏ ప్రాబ్లం లేదు. నా భార్య ధోరణి మారేదెలా?” 

జవాబు:-     కొందరు స్త్రీలలో 50-55 సంవత్సరాలు వచ్చేసరికి మెనోపాజ్‌ లక్షణాలు వస్తాయి. దాంతో సెక్స్‌ ఎడల ఆసక్తి తగ్గుతుంది. దానికి తోడు ఈస్ట్రోజన్‌ హార్మోను లెవెల్స్‌ తగ్గి యోని లోపల పొరలు పలచనవుతాయి. దాంతో సెక్స్‌లో పాల్గొంటే బాధ కలుగుతుంది. యోనిలో ద్రవాలు కూడా ఊరడం తగ్గుతాయి. యోనిలో మంటకి, నొప్పికి అది కూడా ఒక కారణం. సెక్స్‌లో ఆసక్తి తగ్గడం, యోనిలోని మార్పులు సెక్సు ఎడల విరక్తికి కారణం. కాని చాలామంది స్త్రీలు దీనిని గమనించరు. డాక్టరుని సంప్రదించి మందులు వాడితే అంతా చక్కగా మారుతుంది. కొందరికి హార్మోన్‌ రీప్లేస్‌మెంటు థెరపీ అవసరం అవుతుంది. వయస్సు మళ్ళిన వారిలో ఎప్పుడైనా సెక్సు విషయంలో తేడా వస్తే సెక్స్‌లో ఆసక్తి తగ్గిపోయిందని సరిపెట్టుకోకుండా హార్మోన్లపరంగా, వయస్సుపరంగా తేడాలు వచ్చాయేమోనని గుర్తించి సరైన చికిత్స పొందాలి. దాంతో తిరిగి పూర్వంలాగా యాక్టివ్‌ అవుతారు. 

spot_img

Must Read

Previous articleWhy She Is Not Interested
Next articleGive Quick Advice

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!