ప్రశ్న:-”నాకు హెచ్.ఐ.వి. ఉంది. హెచ్.ఐ.వి., ఎ.ఆర్.వి. మందులు వాడుతున్నాను. ఇటీవల రక్తహీనత ఏర్పడింది. చాలా నీరసంగా ఉంటోంది. ఎ.ఆర్.వి. మందులు వాడుతున్నప్పటికీ ఈ రకంగా రక్తహీనత ఎందుకని వచ్చింది?”
జవాబు:-80 శాతం హెచ్.ఐ.వి. రోగుల్లో రక్తహీనత ఉంటుంది. ఎ.ఆర్.వి. మందులు వాడుతున్నప్పటికీ రక్తహీనత ఏర్పడవచ్చు. ఆ మందులు పనిచేయక కూడా వ్యాధి ముదరవచ్చు. హెచ్.ఐ.వి. ఉన్న వారిలో ఎర్రకణాల ఉత్పత్తి దెబ్బతింటుంది. హెచ్.ఐ.వి.తో పాటు వచ్చే ఇతర వ్యాధుల వల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుంది. హెచ్.ఐ.వి.ని కంట్రోల్ చేయడానికి వాడే జిడోవిడిన్ మందు వల్ల కూడా రక్తహీనత ఏర్పడవచ్చు. అందుకని హెచ్.ఐ.వి. ఉన్నప్పుడు రక్తహీనత దేనివల్లో గమనించాలి. హెచ్.ఐ.వి. వల్ల రక్తహీనతతో పాటు తెల్లకణాలు, ప్లేట్లెట్స్ కూడా తగ్గుతాయి. రక్తహీనత ఎక్కువ ఉంటే రక్తం ఎక్కించాలి. కొందరికి ఇమ్యునో గ్లోబ్యులిన్స్ ఇవ్వాలి. ఐరన్ వాడాలి. పౌష్ఠికాహారం చాలా ముఖ్యం. డాక్టరుకి చూపించి సరైన చికిత్స పొందితే రక్తహీనత నుంచి తేలికగా కలుసుకోవచ్చు.