Friday, October 22, 2021
spot_img

భార్య క్షయవ్యాధి భర్తకు రావొచ్చు

ప్రశ్న:-”ఇటీవల నా భార్యకి బాగుండకపోతే డాక్టరు దగ్గరికి తీసుకుపోయాను. ఆయన పరీక్ష చేసి ఆమెకి క్షయవ్యాధి ఉందని, మందులు వాడమని, మూడు నెలలు దాకా సెక్సుకి దూరంగా ఉండమని, ఆ తరువాత కూడా కొంతకాలం ముద్దులు పెట్టుకోవద్దని అన్నారు. ఇప్పటివరకు ఆమెతో సెక్సులో పాల్గొంటున్న విషయం ఆయనకు చెప్పలేదు. ఆమెతో సెక్సులో పాల్గొనడం వల్ల నాకూ క్షయవ్యాధి వచ్చేసి ఉంటుందా?” 

జవాబు:-సెక్సు వల్ల క్షయవ్యాధి రాదుగాని, క్షయరోగి దగ్గడం, తుమ్మడం వల్ల ఆ వ్యాధి క్రిములు ఎదుటివ్యక్తికి అతి తేలికగా సంక్రమిస్తాయి. దానివల్ల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప క్షయ ఉన్న వ్యక్తితో సెక్సు చేయడం వల్ల కాదు. పెదవులు రెండూ కలిపి ముద్దు పెట్టుకుంటే దగ్గుతో నోట్లోకి చేరిన క్రిములు ఆరోగ్యవంతునికి తేలికగా సంక్రమిస్తాయి. అందుకనే డాక్టరు ముద్దు పెట్టుకోవద్దని చెప్పారు. సాధారణంగా క్షయవ్యాధికి మందులు మొదలుపెట్టిన తరువాత రెండు నెలల్లో కళ్ళెలో క్రిములు లేకుండా పోతాయి. దాంతో వ్యాధి సంక్రమణ ఉండదు. కాని మీరు మీ శ్రీమతికి చాలా దగ్గర్లో ఇంతవరకు ఉన్నారు కనుక వ్యాధి సంక్రమించే అవకాశం లేకపోలేదు. ఒకసారి డాక్టరు చేత పరీక్ష చేయించుకోండి. మీ అనుమానం తీరిపోతుంది. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!