ప్రశ్న:- ”నేను ఒక వేశ్యని కలిశాను. అర నిమిషంలోనే వీర్యం పడిపోయింది. రెండు-మూడు స్ట్రోక్స్ కంటే ఎక్కువ ఇవ్వలేకపోయాను. ముద్దులు మాత్రం చాలాసేపు పెట్టుకున్నాము. ఇద్దరి నోళ్ళల్లోకి చాలా ఉద్రేకంగా నాలుకలు పెట్టుకుని గాఢమైన ముద్దులు పెట్టుకున్నాం. అలా చేస్తున్నప్పుడు సుఖం పొందాలనే తీవ్రమైన కోరికే తప్ప మరో ఆలోచన రాలేదు. ఆ అమ్మాయి దగ్గర ఎంతో తెగింపు వచ్చింది. అంతా జరిగిపోయాక ఇప్పుడు ఎయిడ్స్ భయం పట్టుకుంది. సెక్స్ చేసింది అరనిమిషమే కనుక నాకు ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉందా? నేను కండోమ్ వేసుకోలేదు. ఆమె కండోమ్ వేసుకోమని అడగలేదు. అందుకే మరింత భయంగా ఉంది.”
జవాబు:- అపరిచిత వ్యక్తులతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు కండోమ్ వాడకపోతే ఎయిడ్స్ ప్రమాదం లేకపోలేదు. కాని ఒక్కసారికే ఎయిడ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఆల్రెడీ అంగం మీద పుండు ఉన్నా, అంగం అనారోగ్యంగా ఉన్నా, సెక్స్‌లో పాల్గొన్నప్పుడు చర్మం తెగినా మొదటి కలయికలోనే ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. ముద్దుల ద్వారా ఎయిడ్స్ వచ్చే అవకాశం తక్కువ. మీ విషయంలో మూడు నెలలు దాటిన తరువాత హెచ్.ఐ.వి. టెస్టు చేయించుకోండి. అప్పటికిగాని హెచ్.ఐ.వి. తెలియదు. ఈలోగా తెలుసుకోవాలంటే హెచ్.ఐ.వి. డిఎన్ఎ పిసిఆర్ టెస్టు చేయించుకోండి.