ప్రశ్న:- ”నా వయస్సు 22 సంవత్సరాలు. నా వయస్సుకి తగ్గట్టు అంగం పెరగలేదని అనిపిస్తోంది. ఇంట్లో పెళ్ళి చేస్తామంటున్నారు. అంగం చిన్నదిగా పెట్టుకుని పెళ్ళి చేసుకుంటే భార్య దగ్గర అభాసుపాలు అవుతానని భయంగా ఉంది. అంగం చిన్నది కనుక భార్యని తృప్తి పరచలేననే విషయం అమ్మా, నాన్నలకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. రోజు రోజుకీ ఆందోళన పెరుగుతోంది. పెళ్ళి అన్న దగ్గర నుంచి అంగస్తంభనలు తగ్గిపోయాయి. ఇదివరకు రోజుకి 3-4 సార్లు హస్తప్రయోగం చేసేవాణ్ణి. ఇప్పుడు వారానికి ఒక్కసారి కూడా చేయడం లేదు. అసలు నేను పెళ్ళికి పనికి వస్తానా? రానా? పెళ్ళికి పనికి రాకపోతే ఆత్మహత్యే శరణ్యం.”
జవాబు:- సాధారణంగా మగపిల్లల్లో 12 సంవత్సరాలు వరకు చిన్నప్పుడు అంగపరిమాణం ఎంత ఉంటుందో దాదాపు అంతే ఉంటుంది. సెక్సు హార్మోన్లు అంతగా ఉత్పత్తి కాకపోవడమే ఇందుకు కారణం. ఆ తరువాత సెక్స్ హార్మోన్ల ఉత్పత్తితో అంగపరిమాణం చకచకా పెరుగుతుంది. 18 సంవత్సరాలు వచ్చేసరికి పెరగవలసినంతా పెరుగుతుంది. ఇక అటుపైన అంగపరిమాణం పెరుగుదల ఉండదు. కాని అంగస్తంభనలు చక్కగా ఉంటాయి. అంగస్తంభనలు చక్కగా ఉన్నప్పుడు అంగపరిమాణం ఎంత ఉన్నదీ అనవసరం. మీరు పెళ్ళికి పూర్తిగా అర్హులే. మీలోని ఆందోళన వల్లే ప్రస్తుతం అంగస్తంభనలు అంతగా లేవు. వాస్తవాన్ని అర్థం చేసుకుని ధైర్యంగా ఉండండి. నిర్భయంగా పెళ్ళి చేసుకోండి.