ప్రశ్న:-”నా వయస్సు 19 సంవత్సరాలు. ఆర్మీలో చేరాలని ఆశ. నా హైట్ 5 అడుగుల 3 అంగుళాలు మాత్రమే ఉన్నాను. ఆర్మీలో చేరాలంటే ఇంత కంటే ఎక్కువ హైట్ ఉండాలట. సెక్స్‌కి బానిసనై చాలా సంవత్సరాలుగా హ్యాండ్ ప్రాక్టీసు చేస్తూ వచ్చాను. అదే ఇప్పుడు నా కొంప ముంచింది. హైట్ పెరగకుండా పీలగా ఉన్నాను. గత కొద్ది నెలలుగా హ్యాండ్ ప్రాక్టీసు మానేశాను. తెగ తింటున్నాను. అయినా ఒక అంగుళం కూడా పెరగలేదు. హస్తప్రయోగం ఇంత భయంకరంగా నష్టం కలిగిస్తుందా?”
జవాబు:- హస్త ప్రయోగం ఏ మాత్రం హానికరం కాదు. హైట్ పెరగకపోవటానికి, హస్తప్రయోగం చేయడానికి సంబంధం లేదు. హైట్ పెరిగే వాళ్ళు ఎంత హస్తప్రయోగం చేసినప్పటికీ మామూలుగానే ఎదుగుతారు. హైటు అనేది తల్లిదండ్రుల ఎత్తును బట్టి ఉంటుంది. తల్లిదండ్రులు పొట్టివాళ్ళయితే పిల్లలు కూడా పొట్టిగానే ఉంటారు. తల్లిదండ్రులు హైట్ ఉన్నప్పటికీ హైట్ పెరగని పిల్లలూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఎదిగే వయస్సులో తగిన పౌష్టికాహారం తీసుకోకపోవడమే. తరచుగా జబ్బులకి గురయ్యేవాళ్ళు, విరోచనాలు అయ్యేవాళ్ళు కూడా పెరిగారు. ఏది ఏమైనప్పటికీ 18-19 సంవత్సరాలు దాటిన తర్వాత ఎంత తిన్నా, ఎంత వ్యాయామం చేసినా ఏమాత్రం హైట్ పెరగడం ఉండదు. అందకుని మీరు ఏదో చేయరానిది చేశానని బాధపడి మనస్సుని చెడగొట్టుకోకండి.