ప్రశ్న:- ”నా వయస్సు 70 సంవత్సరాలు. బి.పి., షుగరు ఉన్నాయి. మందులు వాడుతున్నప్పటికీ షుగరు కనపడుతూనే ఉంది. బి.పి. కూడా ఉంటూనే ఉంది. వారం – పది రోజులకి ఒకసారి సెక్స్‌లో పాల్గొంటున్నాను. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు బాగా ఎగ్జైట్ అవుతాను. కామోద్రేకం బాగా కలుగుతుంది. కామంతో స్ట్రోక్స్ కూడా బలంగానే ఇస్తాను. మంచి థ్రిల్లింగ్‌గానే అనిపిస్తుంది. వయస్సు ముదిరింది. కనుక సెక్స్‌కి దూరంగా ఉండాలని భావిస్తాను. కానీ కుదరడం లేదు. పైపెచ్చు సెక్స్ తీవ్రత పెరిగి బాగా ఎగ్జైట్ అయి సెక్స్ చేస్తాను. నాకు బి.పి., షుగరూ తరచూ కనబడటానికి సెక్స్‌లో పాల్గొనడమే కారణమా? ఎమోషనల్‌గా ఫీల్ అయితేనూ, టెన్షన్ వస్తేనూ బి.పి., షుగరు పెరుగుతాయని అంటారు కదా. మరి నాకు సెక్స్ టెన్షన్ కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనస్సుని నిగ్రహించుకోవడం చేతకావట్లేదు. నాకు తగిన సలహా ఇవ్వగలరు.”
జవాబు:- బి.పి. షుగరు ఉన్నప్పటికీ కొందరు వయస్సు మళ్ళిన వాళ్ళు శారీరకంగా, మానసికంగా హుషారుగానే ఉంటారు. చక్కని స్టామినా కలిగి ఉంటారు. సెక్స్‌లో పాల్గొనగలుగుతారు. సెక్స్ కోరిక, స్టామినా చక్కగా ఉన్నప్పుడు బి.పి., షుగరు ఉన్నప్పటికీ నిరభ్యంతరంగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. సెక్స్ విషయంలో కలిగే ఎమోషన్స్, టెన్షన్స్, మానసిక వత్తిడి తొలగి బి.పి., షుగరుని పెరగకుండా చేస్తాయి. అందుకని ఈ విషయంలో మీకు ఎటువంటి భయం అవసరం లేదు. బి.పి., షుగరు పూర్తిగా అదుపులో లేవంటే మీరు వాడే మందుల మోతాదు సరిపోవడం లేదు. ఆహారంలో పాటించవలసిన నియమాలని సరిగా పాటించడం లేదు. చేయవలసినంత వ్యాయామం చేయడం లేదు. స్థూలకాయం ఉంటే తప్పకుండా తగ్గాలి. స్థూలకాయం ఉన్నప్పుడు మందులు వాడుతున్నప్పటికీ తగిన ప్రయోజనం చేకూరదు. ఆహారం తగ్గించాలి. రోజూ కనీసం గంట అయినా నడుస్తూ, ఉండలసినంత బరువే ఉండేటట్టు చూసుకుని మందులు వాడితే బి.పి., షుగరు పూర్తిగా అదుపులో ఉంటాయి.