Friday, October 22, 2021
spot_img

షుగర్‌ గురించి ముందే తెలుస్తుందా?

ప్రశ్న:-”నాకు ఈ మధ్య మూత్రం ఎక్కువగా వస్తోంది. ఏదైనా ఎక్కువ ఆలోచిస్తే తల దిమ్మెక్కిపోతోంది. ఈ రెండు కంప్లైంట్‌లు చిన్నవేగా అని డాక్టరు దగ్గరికి వెళ్ళడమెందుకని ఊరుకున్నాను. ఎన్ని రోజులైనా ఈ బాధలు తగ్గకపోవడంతో డాక్టరుకి చూపించుకున్నాను. డాక్టరు పరీక్షచేసి నాకు షుగరు, బి.పి. రెండూ ఉన్నాయని చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. డాక్టరు గారు మందులు రాసిస్తూ మీరు ఇంకా ముందుగా చూపించుకుంటే బాగుండేది అన్నారు. నేను ఇదివరకు సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో ఒకసారి షుగరు చూపించుకునేవాణ్ణి. ఎప్పుడూ మాత్రంలోగాని, రక్తంలోగాని షుగరు లేదు. మరి ఇప్పుడు ఎలా వచ్చింది? డాక్టరన్నట్టు షుగరుని ముందుగానే తెలుసుకునే మార్గం ఉందా?” 

జవాబు:- షుగరు ఉన్నట్టు రక్తపరీక్షలో ముందుగానే తెలుసుకోవచ్చు. మామూలుగా రొటీన్‌ ఎగ్జామినేషన్స్‌లో షుగరు బయటపడకపోవచ్చు. ఈనాడు భారతదేశంలో నాలుగు కోట్లమంది మధుమేహం రోగులు ఉన్నారు. ఇంకా బయటపడని వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. వీళ్ళని ప్రీ డయాబెటిక్స్‌ అంటారు. ఈ ప్రీ డయాబెటిక్స్‌లో గ్లూకోజు టాలెరెన్స్‌ తక్కువగా ఉంటుంది. అలాగే ఫాస్టింగ్‌ గ్లూకోజు లెవెల్స్‌ ఎక్కువలో ఉంటాయి. ప్లాస్మా గ్లూకోజు బ్లడ్‌ టెస్టు చేసినట్టయితే ఇది తెలుస్తుంది. షుగరు కంప్లైంట్‌ ఏమాత్రం లేని వాళ్ళకి పరగడుపున ఏమీ తినకుండా, తాగకుండా ప్లాస్మా గ్లూకోజు టెస్ట్‌ చేస్తే ప్లాస్మా గ్లూకోజు 100 మి.గ్రా. కంటే తక్కువ ఉంటుంది. అదే ప్రీడయాబెటిక్స్‌ అయినట్టయితే వాళ్ళకి 100 నుంచి 125 మధ్య ఉంటుంది. ఫాస్టింగ్‌ ప్లాస్మా గ్లూకోజ్‌ టెస్టు చేసిన తర్వాత 75 గ్రాములు గ్లూకోజుని రెండు గ్లాసుల నీళ్ళల్లో కలిపి ఒకేసారి ఇచ్చి, అది తాగిన రెండు గంటలకి తిరిగి ప్లాస్మా గ్లూకోజు టెస్ట్‌ చేస్తే షుగరు జబ్బు లేనివాళ్ళల్లో 140 మి.గ్రా. ఉఞటే, షుగరు రావడానికి అవకాశం ఉన్న ప్రీ డయాబెటిక్స్‌లో 140-199 మధ్య ఉంటుంది. ఈ రకంగా ఆ వ్యక్తుల్లో షుగరు వస్తుందని గుర్తించవచ్చు. అయితే ప్రీ డయాబెటిక్స్‌ అందరూ మధుమేహ రోగులుగా మారరు. కేవలం 30 శాతం మందే మధుమేహ రోగులుగా మారతారు. ప్రీ డయాబెటిక్స్‌ను తెలుసుకోవడానికి సిరం మెగ్నీషియం లెవెల్స్‌ కూడా తోడ్పడతాయి. ప్రీ డయాబెటిక్స్‌లోనూ, డయాబెటిక్‌ ఉన్న వాళ్ళల్లోనూ సిరం మెగ్నీషియం లెవెల్స్‌ ఉండవలసిన

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!