Saturday, October 16, 2021
spot_img

బక్కప్రాణికి, భర్త రాడా?

ప్రశ్న:-   ”నా వయస్సు 25 సంవత్సరాలు. కాని 15 సంవత్సరాల అమ్మాయిలాగా ఉంటాను. 25 అంటే ఎవరూ నమ్మరు. అంత పీలగా ఉంటాను. చిన్నగాలి వస్తే ఇట్టే ఎగిరిపోతానని అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. సన్నగా ఉండబట్టే నాకు పెళ్ళి సంబంధాలు కూడా రావడం లేదు. నాలో సెక్స్‌ కోరికలకి కొదవలేదు. ఒక్కోసారి సెక్స్‌ కోరిక తట్టుకోలేక పిచ్చిగా షేక్‌ అయిపోతాను. అయినా ఏం లాభం? సన్నటి అమ్మాయి మీద ఏ మగాడికీ మనస్సు కలగదు కదా? నేను లావు అయ్యే మార్గం చెప్పండి.”

జవాబు:-     బాగా పీలగా ఉండటానికి మీలో ఏదో ఒక మెటబాలిక్‌ డిజార్డర్‌ ఉండాలి. హార్మోను లోపం ఉండాలి. థైరాయిడ్‌ గ్రంథి అధికంగా పనిచేస్తున్న వారిలో ఎంత తిన్నా పీలగానే ఉండిపోతారు. డాక్టరుకి చూపించుకుని పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోండి. మీలో ప్రత్యేకంగా ఏ లోపమూ లేకపోతే రోజూ రెండు పూటలా పాలు తాగండి. అరటి పళ్ళు బాగా తినండి. నేతితో చేసిన గారెలు, ఇతర పిండి వంటలు తినండి. తిన్నవి బాగా వంట పట్టడానికి రోజూ కొంతసేపు వ్యాయామం చేయండి. అరుగుదల మందులు వాడండి. కంటినిండా నిద్రపోండి. ఎక్కువ అలసిపోయే పనులు చేయకండి. తప్పకుండా ఒళ్ళు చేస్తారు. అందమైన పెళ్ళి కూతురిగా మారతారు.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!