Tuesday, October 19, 2021
spot_img

క్షణంలో ఆమె కణకణం కామప్రేరకమే!

ప్రశ్న:-   ”నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఒక గర్ల్‌ఫ్రెండ్‌ ఉంది. ఇద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. త్వరలోనే పెళ్ళి చేసుకుంటాం. ఇద్దరం ఏకాంతంగా కలుసుకున్నప్పుడు ముద్దులు, కౌగిలింతలతో చాలా సమయం గడిపేస్తాం. ఎలాగూ పెళ్ళి చేసుకోబోతున్నాం కనుక దాదాపు ప్రతిసారీ సెక్స్‌లో పాల్గొంటున్నాము. ఆమె నా పురుషాంగం మీద చేయివేస్తే చాలు చెప్పలేనంత ప్రేరణ కలుగుతుంది. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. కాని ఇతరత్రా శరీరంలో ఎక్కడ తాకినా నాకేమీ థ్రిల్‌ అనిపించదు. అదే ఆ అమ్మాయి ఎక్కడ ముద్దు పెట్టుకున్నా మురిసిపోతూ ఉంటుంది. అంటే నాలో సెక్స్‌ తక్కువ ఉన్నట్టా? ఆ అమ్మాయిలో ఎక్కువ ఉన్నట్టా?”

జవాబు:-     ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ శరీరమంతా కామకేంద్రాలే. వీణని ఎక్కడ మీటినా మధుర రాగాలు పలికినట్టుగానే సెక్స్‌పరంగా స్త్రీ వైబ్రేట్‌ అయినప్పుడు ఆమె శరీరంలో ఎక్కడ తాకినా సెక్స్‌ పరంగా స్పందనలు కలుగుతాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతం ఎక్కువ సెన్సిటివ్‌గా ఉంటుంది. ఒక రోజు బాగా సెక్స్‌ ప్రేరణ కలిగించిన చోట మరుసటి రోజు అంతగా ప్రేరణ కలిగించకపోవచ్చు. అయితే పెదవులు, బుగ్గలు, వక్షోజాలు. క్లైటోరిస్‌ దాదాపు ప్రతిసారీ సెక్స్‌ ప్రేరణకే అధికంగా స్పందిస్తాయి. పురుషునిలో పురుషాంగానికి సంబంధించిన శిశ్నంలోనే అధికంగా కామనాడులు ఉంటాయి. తక్కిన చోట్ల చాలా తక్కువ ఉంటాయి. అందుకని పురుషుడు ఎల్లప్పుడూ పురుషాంగ ప్రేరణకి ఇష్టపడతాడు. అదే కావాలంటాడు. అంతేతప్ప ఆమెలో సెక్స్‌ అధికంగా ఉండటం, మీలో తక్కువగా ఉండటం కాదు. అయినా పెళ్ళి కాకుండా ఇంత అడ్వాన్స్‌ అవడం మంచిది కాదు.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!