ప్రశ్న:-”నా వయస్సు 18 సంవత్సరాలు. నా బీర్జాలు చిన్నవిగా ఉన్నాయి. అవి కిందికి సాగలేదు. కొందరివి చూసినప్పుడు అవి సాగి పెద్దవిగా కనబడతాయి. మరి నావి అలా లేవు. నావి అలా లేకపోవడంతో సందు దొరికినప్పుడల్లా ఎదుటి వారి బీర్జాలని చూసే అలవాటు అయింది. నాకు సెక్సు కోరికలు ఎక్కువగానే ఉన్నాయి. రోజూ హస్తప్రయోగం 4-5 సార్లు చేస్తాను. అందువల్ల బీర్జాలు పెరగకుండా పోయాయా లేక లోపం ఉందా? నేను పోలీసు ఆఫీసర్ ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నాను. దేహదారుఢ్యంతో పాటు మర్మావయవాల దారుఢ్యం కూడా లేకపోతే మెడికల్‌గా అన్‌ఫిట్ అవుతానా? నా గురించి చాలా ఆందోళనగా ఉంది. నా బీర్జాల పరిమాణం పెరిగే మందులు రాయండి.”
జవాబు:- మీలో సెక్స్ కోరికలు, హస్తప్రయోగాలు ఉన్నాయి కనుక మర్మావయవాలు మామూలుగానే ఉన్నాయనుకోవాలి. కొందరిలో బీర్జాలు చాలా చిన్నవిగా ఉంటాయి. పరీక్ష చేస్తే తప్ప చిన్నవా, కావా చెప్పడం కుదరదు. బీర్జాలు చిన్నవిగా ఉన్నప్పటికీ హార్మోన్ల ఉత్పత్తి మామూలుగానే ఉంటే సెక్స్ సామర్థ్యం బాగానే ఉంటుంది. బీర్జాలు మరీ చిన్నవిగా ఉన్నవాళ్ళల్లో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి డాక్టరు చేత పరీక్ష చేయించుకోండి. చాలా మందికి హైడ్రోసిల్ ఉండి బీర్జాలు పెద్దవిగా కనబడతాయి. అంతేతప్ప అవి నాచురల్ కాదు. అందుకని మీరు డాక్టరుకి చూపించండి.