ప్రశ్న:-”నా వయస్సు 65 సంవత్సరాలు. 2-3 రోజులకి ఒకసారి నా భార్యతో సెక్స్‌లో పాల్గొంటాను. సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ పురుషాంగం ఎర్రగా కందుతుంది. నొప్పి అనిపిస్తుంది. సెక్స్‌లో పాల్గొనలేకపోతే ఎన్ని రోజులైనా ఏమీ ఉండదు. ఇటీవల సెక్స్ సామర్థ్యం కాస్త తగ్గింది. నా భార్యకు నాకు 15 సంవత్సరాలు గ్యాప్ ఉంది. మొదటి భార్య చనిపోగా రెండో పెళ్ళి చేసుకున్నాను. సెక్స్‌లో పాల్గొంటే అంగం నొప్పి పుడుతోంది. మానేస్తే మా ఆవిడ ఊరుకోవడం లేదు. ఆకలి ఎక్కువగానే ఉంటుంది. బాగానే తింటాను. ఈ వయస్సులో ఎదుర్కొంటున్న ఈ సెక్స్ సమస్య నాకు జీవిత సమస్యగా అనిపిస్తోంది. నా భార్య కోరిక తీర్చడం ముఖ్యమా? అంగం పుండు అవకుండా చూసుకోవడం ముఖ్యమా? తెలియకుండా ఉంది. నాకు మీరే దారి చూపాలి.”
జవాబు:- మీకు షుగరు వ్యాధి ఉండవచ్చు. షుగరు ఉన్నవాళ్ళకి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. షుగరు వల్ల సెక్స్‌లో పాల్గొన్నప్పుడు అంగం నలిగినట్టు అయి పుండుగా అనిపిస్తుంది. మీ విషయంలో అదే కావచ్చు. కొందరికైతే పురుషాంగం పూర్వచర్మం బిగుతుగా మారడం, చిట్లడం ఉంటుంది. మీరు షుగరు పరీక్ష చేయించుకోండి. షుగరు ఉంటే దానికి చికిత్స పొందితే బాధలు తొలుగుతాయి. మీ శ్రీమతికి సంతోషం కూడా కలిగిస్తారు. మీకు తలవంపులు కూడా ఉండవు.