Tuesday, October 19, 2021
spot_img

ముగ్గులోకి దిగితే మునకే!

ప్రశ్న:-   ”మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంది. ఆమె తనతో సెక్సు కోసం నన్ను మాటలతో, చూపులతో రెచ్చగొడుతూ ఉంటుంది. నువ్వు మగవాడివేనా అని హేళన చేస్తూ ఉంటుంది. నాకూ సెక్సులో పాల్గొనాలనే కోరిక ఉన్నప్పటికీ భయంవల్ల చాలాకాలం ఆ పనికి తెగించలేకపోయాను. ఓ రోజు తన ఇంట్లోకి లాక్కొనిపోయి నా ఒంటిమీద బట్టలన్నీ లాగిపారేసి, తానూ తీసేసి నా పురుషాంగాన్ని పిచ్చిపిచ్చిగా ప్రేరేపించింది. మొదట్లో కొంత సేపు అంగం గట్టిపడక పోయినప్పటికీ ఆ తరువాత గట్టిపడింది. సెక్స్‌ ఎలా చేయాలో ఆమె నేర్పడంతో తెగింపు వచ్చేసి చేసేశాను. బాగా థ్రిల్‌ అనిపించింది. అటుపైన అడగకపోయినా నేనే ఇంట్రస్టు చూపించసాగాను. ఆంటీ మరింత ఉత్సాహం చూపించి రకరకాలుగా సెక్సు చేసేది. దాంతో నాలో మరింత ఇంట్రస్టు పెరిగిపోయింది. ఇప్పుడు రోజూ ఆమెతో సెక్సు కావాలనిపిస్తోంది. ఎప్పుడూ అదే ఆలోచన. చదువు మీద మనస్సు పెట్టలేకపోతున్నాను. కావాలనుకున్నప్పుడల్లా ఆంటీతో కుదరదు కదా. దాంతో హస్తప్రయోగం అతి అయిపోయింది. నా బతుకు ఏమైపోతుందో తెలియడం లేదు. నేను పెళ్ళికి పనికి రాకుండా అయిపోతానా? ఎంత వద్దనుకున్నా సెక్సు ఆలోచనలు రాకుండా ఆగడం లేదు. నా పరిస్థితి భయంకరంగా మారింది. నన్ను మీరే రక్షించాలి. 

జవాబు:-     చదువుకునే వయస్సులో ఇటువంటి అక్రమ లైంగిక సంబంధాలకి లోనైతే పరిస్థితి ఇలాగే తయారవుతుంది. కొందరు ఆంటీలు సరదాకోసం, కాలక్షేపం కోసం, వెరైటీ కోసం కుర్రవాళ్ళని ముగ్గులోకి దింపడంతో బ్రతుకంతా పాడవుతుంది. చదువు అటకెక్కుతుంది. అందుకని కుర్రవాళ్ళు ఎటువంటి ఆకర్షణలకి లోనుకాకుండా చదువుమీదే మనస్సు కేంద్రీకరించాలి. హస్తప్రయోగం వల్ల ఏమాత్రం హాని లేదు. అక్రమ సంబంధాలు ఏర్పర్చుకోవడంతో మనస్సు పక్క తోవ పట్టి భవిష్యత్‌ అంతా పాడైపోతుంది. మీ విషయంలో మనస్సుని కంట్రోల్‌ చేసుకోవడం, ఆంటీ వైపు చూడకుండా ఉండటం, చదువుమీదే మీదృష్టి కేంద్రీకరించడం ఒక్కటే మార్గం.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!