ప్రశ్న:- ”నా వయస్సు 22. నేను ఇప్పటి వరకు ఏ స్త్రీతో కలవలేదు. సెక్స్ కోరిక చాలా ఎక్కువ. నాలో అంగస్తంభనలు లేవు, పైగా వృషణాలు, అంగం చాలా చిన్నవి, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర మందులు వాడాను. కాని ఏమీ పనిచేయలేదు. నేను సెక్స్‌కి పనికిరానేమో అన్న దిగులు నాలో భయం పుట్టిస్తుంది. అసలు నేను బ్రతకడమే వేస్ట్ అనిపిస్తుంది. నేను బాగవుతానా? లేక ట్రీట్మెంట్ సాధ్యం కాదా? దయచేసి సలహా ఇవ్వగలరు ప్లీజ్…..”
జవాబు:- మీ విషయంలో హార్మోను టెస్టులు, పినెలై కలర్ డాప్లర్ టెస్టులు చేయవలసి ఉంటాయి. అంగస్తంభన లేకపోవడానికి హార్మోన్సు తగినంత లేకపోవడం లేదా నరాలు తగినంత స్పందించకపోవడం లేదా రక్త ప్రసరణలో అస్తవ్యస్తత కారణం కావచ్చు. కొందరిలో ఇవన్నీ బాగా ఉండి కూడా అనవసరమైన భయాలు, కాంప్లెక్స్ ఫీలింగ్స్ ఉండి అంగం స్థంభించకపోవచ్చు. అందుకని అంగస్థంభనలు లేనప్పుడు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పరీక్ష చేయాలి. కొన్ని సందర్భాలలో సింపుల్ కౌన్సిలింగ్ ద్వారా సమస్య పరిష్కారమయిపోతుంది. ఈ రోజుల్లో అంగస్థంభన వైఫల్యాలు పెద్ద సమస్య కాదు. సిలిడినాఫిల్, టాడాల్ఫిల్ వంటి మందులు చాలా కేసుల్లో మంచి ఫలితాలనిస్తాయి. మీరు డాక్టరుకి చూపించుకుని చికిత్స పొందండి. తప్పకుండా బాగుపడతారు.