ప్రశ్న:- ఇటీవల నాకు అంగం తక్కువగా స్థంభిస్తోంది. అంగం కూడా చిన్నదైనట్టు వుంది. సైక్స్లో తృప్తికరంగా పాల్గొనలేకపోతున్నాను. అంగాన్ని ఎంత ప్రేరేపించినప్పటికీ పూర్తిగా గట్టిపడటం లేదు. నేను నపుంసకుడిగా మారిపోతున్నానా? నా బ్రతుకు ఏమైపోతుంది?
జవాబు:- అంగం తగినంత స్థంభించకపోవడానికి హార్మోన్ల లోపం కారణం కావచ్చు. రక్తప్రసరణలో లోపం కారణం కావచ్చు. ఏదైనదీ తగిన పరీక్షలు చేస్తేనే తెలుస్తుంది. సాధారణంగా చేసే పినైల్ కలర్ డాప్లర్ టెస్ట్, హార్మోన్ టెస్ట్‌లో చాలావరకు ఏదైనదీ తెలుస్తుంది. ఎక్కువ మందిలో మానసిక ఆందోళన, భయం, మానసిక వత్తిడి, డిప్రషన్, ఆత్మవిశ్వాసం లేకపోవడం వంటి సైకలాజికల్ కారణాలు అంగం సరిగ్గా స్థంభించకపోవడానికి కారణాలు. మీ విషయంలో డాక్టరుకి చూపించండి. తగిన పరీక్షలు జరిపి కారణాన్ని బట్టి చికిత్స చేస్తారు. ఈ రోజుల్లో అంగస్థంభన వైఫల్యానికి చక్కని మందులు, చికిత్సలూ ఉన్నాయి. నపుంసకునిగా మారిపోతున్నానని బయపడనవసరం లేదు. మీరు తప్పకుండా తిరిగి మామూలు అవుతారు. డాక్టరుని సంప్రదించండి.